వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

31వ తేదీ నుంచి రెండురోజులు బ్యాంకులు బంద్, వేతన సవరణ కోసం ఉద్యోగుల సమ్మె

|
Google Oneindia TeluguNews

వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి. తమ జీతాలను 20 శాతం పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పబ్లిక్ సెక్టార్ యూనియన్ బ్యాంకులు కోరుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరసనకు దిగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి రెండురోజుల పాటు తమ స్ట్రైక్ కొనసాగనుందని స్పష్టంచేశారు.

బ్యాంకులు బంద్..

బ్యాంకులు బంద్..

రెండురోజులపాటు స్ట్రైక్ చేస్తున్నామని యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎప్‌బీయూ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయ్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (నేవోబీడబ్ల్యూ)కు చెందిన బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొంటారు. తమ సమస్యలపై సోమవారం బ్యాంకు సంఘం ప్రతినిధులు చీఫ్ లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపారు. కానీ చర్చలు సానుకూలంగా జరగకపోవడంతో తాము సమ్మెకు వెళుతున్నట్టు ఏఐబీవోసీ అధ్యక్షులు సునీల్ కుమార్ పేర్కొన్నారు.

2017 వరకు..

2017 వరకు..


తమ వేతన సవరణ 2017 నుంచి చేయడం లేదని పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. వేతన సవరనపై స్పష్టమైన హామీనిచ్చేవరకు స్ట్రైక్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. తాము సమ్మెకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయిందని ఐబీఏ యూనియన్ పేర్కొన్నది. సమ్మె వల్ల వినియోగదారుల సేవలకు అంతరాయం కలిగించినందుకు మన్నించాలని. కానీ ఇది బ్యాంక్ మేనెజ్‌మెంట్ల వల్ల జరిగిన చర్య అని ఐబీఏ యూనియన్ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇప్పటికే సమాచారం

ఇప్పటికే సమాచారం

ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు సేవలు అందుబాటులో ఉండబోవని సమాచారం అందించాయి. తమ సమస్యల కోసం దేశవ్యాప్తంగా రెండురోజుల సమ్మె చేయబోతున్నామని సమాచారం అందించాయి. అయితే బడ్జెట్‌కు కొద్దిరోజుల ముందు బ్యాంక్ యూనియన్లు సమ్మెకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ పే స్లిప్పులో 20 శాతం వేతన సవరణ చేయాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

15 శాతం హైక్

15 శాతం హైక్

చివరిసారి బ్యాంకు ఉద్యోగులకు యాజమాన్యం 2012 నవంబర్ 1వ తేదీన వేతన సవరణ చేపట్టారు. 2017 అక్టోబర్ 13వ తేదీ వరకు 15 శాతం హైక్ వేశారు. ఇక అప్పటినుంచి వేతన సవరణ చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కార్మిక సంఘాలు జనవరి 8వ తేదీన సమ్మె చేసిన సంగతి తెలిసిందే.

English summary
SBI, other PSU banks have informed their customers that operations may be impacted due to the proposed 2-day nationwide strike beginning 31 Jan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X