రెండు కొత్త ఎయిర్ లైన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా రెండు పౌర విమానయాన సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. దీనికి అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌లకు ఎన్ఓసీ లభించాయి. ఈ రెండింటితో పాటు శంఖ్ ఎయిర్ కు కూడా ఎన్ఓసీ అందింది.ఇండిగో సంక్షోభం వల్ల తలెత్తిన అంతరాయాల దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశీయ విమాన మార్కెట్‌పై ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్‌లు గుత్తాధిపత్యం సాగిస్తోన్నాయనేది బహిరంగ రహస్యమే. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతో కూడిన ఈ గ్రూప్ దేశీయ ప్రయాణంలో 90 శాతం పైగా వాటాను కలిగి ఉంది. ఇండిగో వాటా 65 శాతం పైమాటే. ఈ నెలలో ఇండిగో విమానాల్లో తలెత్తిన అంతరాయాలు దేశవ్యాప్తంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టాయి. విస్తరిస్తున్న భారత మార్కెట్‌లో ఒకట్రెండు విమాన సంస్థపై అధిక ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను ఈ సంఘటన తేటతెల్లం చేసింది.

ఏటా పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా పౌర విమానయాన సంస్థలు అందుబాటులో లేవనేది మొన్నటి ఇండిగో సంక్షోభంతో తేలిపోయింది. దీంతో కొత్త పౌర విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజా ఎన్ఓసీలను జారీ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధృవీకరించారు. శంఖ్ ఎయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ ప్రతినిధులతో మంత్రిత్వ శాఖ సమావేశమైందని ఆయన పేర్కొన్నారు.
శంఖ్ ఎయిర్‌కు గతంలోనే క్లియరెన్స్ లభించగా, మిగిలిన రెండు సంస్థలకు ఎన్‌ఓసీలు తాజాగా మంజూరు అయ్యాయి. అల్ హింద్ ఎయిర్‌ను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ నిర్వహిస్తోంది. పౌర విమానయానంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. ఇప్పటికే ఎన్‌ఓసీ ఉన్న శంఖ్ ఎయిర్ 2026లో వాణిజ్య విమాన సేవలు ప్రారంభించాలని చూస్తోంది. ఈ మూడు సంస్థలూ తమ సేవలను ప్రారంభించడానికి ముందు రెగ్యులేటరీ, ఆపరేషనల్ దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దేశ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యమని రామ్మోహన్ నాయుడు వివరించారు. చిన్న నగరాలు, పట్టణాలకు విమాన కనెక్టివిటీని మెరుగుపరిచే 'ఉడాన్' వంటి పథకాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఉడాన్ పథకం ద్వారా స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై91 వంటి సంస్థలు గతంలో విమాన సేవలు లేని మార్గాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ సేవలు చిన్న నగరాలను జాతీయ ఏవియేషన్ నెట్‌వర్క్‌లో చేర్చాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications