2020కి అందరికీ ఇళ్లు, 24గంటల విద్యుత్: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కుల, మత సరిహద్దులను చెరిపేసి ప్రజలు అభివృద్ధికి ఓటేశారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ ఎన్నిక అశావాహ దృక్పథంతో జరిగాయని ఆయన అన్నారు. సోమవారం ఆయన పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఉపరాష్ట్ర పతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలికారు.

ఉభయసభలనుద్దేశించి ప్రణబ్ ప్రసంగిస్తూ.. ఇంతపెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం ముదావహం అన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘాన్ని ప్రధానంగా అభినందాలన్నారు. ఈ ఎన్నికల్లో 66.4శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమని అన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు అభినందనీయులని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

Govt committed to poor: President Pranab Mukherjee

దారిద్ర్యానికి, ఆకలికి మతం అనేది లేదని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్రం పాటుపడుతుందని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ప్రజల తక్షణ అవసరాలపై ప్రభుత్వం తక్షణ దృసారిస్తుందని చెప్పారు. సభ్యుల భాగస్వామ్యంతోనే చర్చ ఫలవంతంగా సాగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ ప్రాంతంలోని అన్ని సౌకర్యాలను గ్రామాలకు విస్తరించాలన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.

ఆహార ద్రవ్యోల్బణ పరిష్కారానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రణబ్ అన్నారు. నదుల అనుసంధానం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేయున్నట్లు చెప్పారు. యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తుందని చెప్పారు. యోగాకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలిపారు. అత్యధిక యువత కలిగిన దేశం మనదేనని చెప్పారు.

తమ ప్రభుత్వం నూతన యువజన విధానం అమలు చేస్తుందని చెప్పారు. గ్రామీణ క్రీడలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. ప్రతిభగల క్రీడాకాల గుర్తింపు కోసం కొత్త విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. వివిధ రహదారుల మధ్య అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. మైనారిటీలలో సాంకేతిక విద్య పెంచేందుకు జాతీయ మదర్సా నవీకరణ పథకం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పరిశుద్ధ భారత్ కార్యక్రమం అమలు చేస్తామనిచెప్పారు. పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

మహిళలకు రిజర్వేషన్లు

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నేరన్యాయ విధానంలో మార్పులకు త్వరతిగతిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ సమగ్ర ఆరోగ్య విధానం ప్రకటిస్తామన్నారు. హింసకు తావులేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ, ఏపి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాశ్మీర్ పండిట్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమైన, జనసమ్మర్ద ప్రాంతాల్లో వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పద్దుల డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం పన్నుల రాబడి తగ్గిపోయిందని, ద్రవ్యోల్బణం భరించలేని స్థాయికి చేరిందని అన్నారు. సరళీకృత పన్నుల విధానంతో పరిశ్రమలకు చేయూత ఇస్తామన్నారు. పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం నింపాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రాంతీయ సహకారం మరింత పెంచేందుకు సార్క్‌ను క్రియాశీలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలో అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక పారిశ్రామిక మండళ్లు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక విధానం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తామని అన్నారు. రవాణా వేగవంతానికి అంతర్గత రవాణాను మెరుగుపరుస్తామని చెప్పారు. చిన్న ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు.

దేశ వ్యాప్తంగా 50 పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని ప్రణబ్ అన్నారు. గంగా పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. తీర ప్రాంత రవాణా కోసం నౌకాశ్రాయాల నవీకరణ, అదనపు పోర్టుల నిర్మాణం చేపబడతామన్నారు. వజ్ర, చతుర్భుజి పథకం ద్వారా హై స్పీడ్ రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం ఎఫ్‌డిఐలతోపాటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు.

పారదర్శక పన్నుల విధానం కోసం జిఎస్‌టిని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. భూతాప సంబంధిత అంశాల్లో అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేస్తామని అన్నారు. హిమాలయాల పరిరక్షణ కోసం హిమాలయ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2022 కల్లా అందరికీ ఇళ్లు, 24 విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త ఒరవడితీసుకొస్తామన్నారు.

బొగ్గు క్షేత్రాల అభివద్ధిలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తయరీ రంగంలో త్వరతగతిన అనుమతికోసం, ప్రభుత్వ అనుమతుల కోసం రాష్ట్రాలు, కేంద్రం అనుమతి కోసం ఏకగవాక్ష విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులను తుదముట్టించేందుకు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రక్షణ రంగంలో ఆధునాతన పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందని చెప్పారు. అంతర్గత రక్షణ కోసం నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+