వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనదారులకు కేంద్రం ఊరట! పెట్రోల్, డీజిల్ పై రూ.2 ఎక్సైజ్ సుంకం తగ్గింపు..

వాహనదారులకు శుభవార్త. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 మేర బేసిక్ ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వీటి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుండటంతో కేంద్రం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. జులై 4 తర్వాత పెట్రోల్‌ ధర రూ.7.8 పెరగ్గా.. డీజిల్‌ ధర రూ.5.7 మేర పెరిగింది.

రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి వినియోగదారులకు కేంద్రం వూరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 మేర బేసిక్ ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. తగ్గించిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

petrol-filling

బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌కు ఈ తగ్గింపు వర్తించనుందని, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులే ఈ తగ్గింపునకు కారణమని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

తాజాగా ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.70.88 కాగా.. డీజిల్‌ ధర రూ.59.14గా ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రానికి ఆదాయం వస్తోంది.

English summary
The central government on Tuesday cut basic excise duty on petrol and diesel by Rs 2 per litre from October 4. Petroleum and Natural Gas Minister Dharmendra Pradhan had earlier said that fuel prices may come down by Diwali. Petrol and diesel prices have gone through the roof ever since the central government announced daily revision of fuel prices. Petrol price in Delhi on Tuesday was at Rs 70.83 per litre, whereas in Mumbai a litre of petrol costs Rs 79.99. After the excise duty cut, petrol petrol price in Delhi will come down to Rs 68.83, and diesel price to Rs 57.07. The government will incur losses to the tune of Rs 13,000 crore for the remainder of ongoing financial year and Rs 26,000 crore in a full year, said a government statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X