టిపై నేడే లోకసభలో ఓటింగ్, రాజ్యసభలో 2 గంటల టైం

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన మాట్లాడే అవకాశముంది. సోనియా బిల్లుపై చర్చను ప్రారంభించే అవకాశముంది. బిల్లు పైన చర్చకు లోకసభలో నాలుగు గంటలు, రాజ్యసభలో రెండు గంటలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లోకసభలో నాలుగు గంటలకు ఓటింగ్ జరిగే అవకాశముంది. విపక్షాలు సహకరించకుంటే మూజువాణి ఓటింగ్ జరగొచ్చు.

బిల్లుపై చర్చ సందర్భంగా ఎవరైనా బిల్లును వ్యతిరేకించదలచుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకించవచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ పద్ధతులు తప్ప ఇతర పద్ధతులకు స్థానం లేదని మీడియా ప్రతినిధులకు కమల్ స్పష్టం చేశారు.

Sonia Gandhi

తెలంగాణ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు అధికార పక్షం విపక్షాల మద్దతును కూడగట్టుతోంది. విపక్షాలు సహకరించకుంటే మూజువాణి ఓటుతోనైనా నెగ్గించుకోవాలని చూస్తోంది. సోనియా సోమవారం పార్లమెంటు ఆవరణలో కనిపించిన బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడును నవ్వుతూ పలకరించారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై తాము చేసిన సూచనలను వెంకయ్య ప్రస్తావిస్తూ మీరు ఆ సవరణలను అమలు చేస్తే మద్దతిస్తామని చెప్పారు.

అదే సమయంలో బిల్లుకు మద్దతు ప్రకటించాలని బిజెపి అగ్రనేత అద్వానీని హోం శాఖ మంత్రి షిండే, జైరాం రమేశ్ అభ్యర్థించారు. ఆ తర్వాత అటు వచ్చిన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలను కూడా వీరిరువురూ ఇదే విషయమై అభ్యర్థించారు. లోకసభలో అసలు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనేలేదని సుష్మా స్వరాజ్, పార్లమెంటులో ఓట్ఆన్ అకౌంటును తప్ప మరొక అంశంపై చర్చను అనుమతించే ప్రసక్తేలేదని అద్వానీ ఇంతకుముందే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+