వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

covid చికిత్సకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ -పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు -తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయి

|
Google Oneindia TeluguNews

పలు దేశాల్లో కరోనా మహమ్మారి మూడో దశ విలయం మొదలైన దరిమిలా, భారత్ లోనూ అది తప్పదని, తొలి, రెండో దశల్లో వృద్దులు, యువకులను బలితీసుకున్న మహమ్మారి.. మైడో దశలో చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందనే రిపోర్టులు వెలువడటం తెలిసిందే. అయితే, మన దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ తలెత్తబోదని, చిన్నపిల్లలకు పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్రం భరోసా ఇస్తున్నప్పటికీ, చిన్న పిల్లలకు కరోనా చిత్సపై కీలక మార్గదర్శకాలను జారీచేసింది..

చిన్నారులు కోవిడ్ ప్రభావితమయితే దానికి సంబంధించిన చికిత్స, నిర్వహణ పద్దతులను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) బుధవారం ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో..

షాకింగ్: ప్రభుత్వాలే యూనియన్ పెడితే -కేంద్రంపై పోరుకు రాష్ట్రాల యూనియన్ ప్రతిపాదించిన మమతషాకింగ్: ప్రభుత్వాలే యూనియన్ పెడితే -కేంద్రంపై పోరుకు రాష్ట్రాల యూనియన్ ప్రతిపాదించిన మమత

govt-issues-guidelines-on-covid-for-children-no-remdesivir-6-minute-walk-test-details-here

కరోనా సోకిన చిన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్‌ సీటీ స్కాన్‌ను తీయించాలని చెప్పింది. స్టెరాయిడ్లను కూడా దాదాపు అవాయిడ్ చేయాలని, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్ గా భావించాలని, ఎందుకంటే లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి ఇవి హానికరమని కేంద్రం పేర్కొంది.

కరోనా సోకిన తర్వాత, తక్కువ, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారిలో జ్వరం తగ్గేందుకు ప్రతి 4-6 గంటలకు ఒకసారి పారాసిటమాల్‌ 10-15ఎంజీ/కేజీ/డోసు ఇవ్వొచ్చని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం చెప్పింది. పిల్లలకు కరోనా టెస్టులకు సంబంధించి.. గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్‌ ఆక్సీమీటర్‌ సాయంతో వారి ఆక్సిజన్‌ స్థాయులు తెలుసుకోవాలని, ఆక్సిజన్‌ సమస్య తలెత్తితే వైద్యుల్ని సంప్రదించాలని పేర్కొంది.

కరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలుకరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలు

గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మే చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 9,300 మందికి పైగా చిన్నారులు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) వెల్లడించింది. ఇలాంటి బాలల సంక్షేమం కోసం ఆరంచెల పథకాన్ని ప్రారంభించామని సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్‌ అఫిడవిట్‌ను సమర్పించింది.అనాథలైన పిల్లల కోసం రూపొందించిన 'బాల్‌ స్వరాజ్‌' పోర్టల్‌లో 9,346 మంది అనాథ బాలల వివరాలను ఎన్‌సీపీసీఆర్‌ అప్‌లోడ్‌ చేసింది.

English summary
The Union Health Ministry has issued clinical guidelines for the treatment of Covid-positive children amid concerns that a possible third wave of the coronavirus infections may target those aged below 18. In a detailed document titled 'Comprehensive Guidelines for Management of COVID-19 in Children', the ministry said antiviral drug Remdesivir is not recommended for children, and steroids should be used to treat only moderately severe and critically ill patients in hospital settings. govt has recommended use of what it called the '6-Minute Walk Test' on children above 12 to assess "cardio-pulmonary exercise tolerance".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X