Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.10 లక్షలు.. సర్కార్ కొలువు కూడా.. వ్యాపారి కుటుంబంతో యోగి భేటీ

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో గల హోటల్‌లో హత్యకు గురయిన వ్యాపారి ఘటనపై యూపీ సర్కార్ స్పందించింది. ఇంటా, బయట విమర్శలు రావడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. చనిపోయిన కాన్పూర్‌కి చెందిన వ్యాపారి మనీశ్ గుప్తా కుటుంబాన్ని గురువారం కలిశారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే రూ.10 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు.

ఉద్యోగం

ఉద్యోగం

కాన్పూర్ డెవలప్ మెంట్ అథారిటీ విభాగంలో ఓఎస్డీ పోస్టును మీనాక్షి గుప్తాను అందించనున్నారు. అలాగే తన కుమారుడి విద్యకు అయ్యే ఖర్చును భరించాలని మీనాక్షి సీఎంను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. హత్య కేసును గోరఖ్ పూర్ నుంచి కాన్పూర్ బదిలీ చేశామని వివరించారు. సీఎం తమ ఇంటికి వచ్చి.. హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందానని మీనాక్షి వివరించారు. తీవ్రమైన ఘటనలకు సంబంధించి పోలీసులు తప్పుగా ప్రవర్తంచినట్టు రుజువు అయితే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

వ్యాపారుల భేటీ

వ్యాపారుల భేటీ

గోరఖ్‌పూర్ ఓ హోటల్‌లో ముగ్గురు వ్యాపారులు సమావేశం అయ్యారు. రెగ్యులర్ చెకప్ కోసం పోలీసులు వచ్చారు. అయితే అందులో ఒకరు మనీశ్ కుమార్ గుప్తా ఉన్నారు. అర్ధరాత్రి దాటాక వచ్చి ఐడీ కార్డు చూపాలని వేధింపులకు గురిచేశారు. మిగతా వ్యాపారులతో గొడవకు దిగారు. మనీశ్ ఇదేంటి అని ప్రశ్నించగా.. ఇద్దరిని బయటకు పంపించారు. అతనిపై దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం, తలపై రక్తం వచ్చిందని అతని స్నేహితుడు తెలిపారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనే అంశంపై స్నేహితుడు సింగ్ వివరించారు. ఇతను హర్యానాలో గల గురుగ్రామ్‌కు చెందినవారు. మద్యం సేవించిన పోలీసులు తమ గదికి వచ్చారని ఆరోపించారు. వారి చేతిలో తుపాకులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తమను ఐడీ కార్డులు చూపించమని బెదిరించారని.. దాడి చేశారని తెలియజేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే సమాచారం వచ్చిందని వివరించారు. అందుకే రైడ్ నిర్వహించామని కవరింగ్ చేసే యత్నం చేశారు.

కలిసి ఉండటంతో..

కలిసి ఉండటంతో..

వివిధ నగరాలకు చెందిన వ్యాపారులు హోటల్ గదిలో ఉన్నారని గోరఖ్ పూర్ పోలీస్ చీఫ్ విపిన్ తాడా వివరించారు. మేనేజర్ సాయంతో గదిలోకి ప్రవేశించామని పేర్కొన్నారు. గదిలో అనుకొకుండా జరిగిన ఘటనలో వ్యాపారి గాయపడ్డారని వివరించారు. వెంటనే అతనిని ఆస్పత్రికి కూడా తరలించారని చెప్పారు. అర్ధరాత్రి హోటళ్లను తనిఖీ చేయడం తమ రోజువారీ డ్యూటీలో భాగం అని వివరించారు. ఈ కామెంట్లను మృతుడి భార్య ఖండించారు. చనిపోయే 10 నిమిషాల ముందు కూడా తనతో మాట్లాడరని చెప్పారు. పోలీసులు వచ్చారని చెప్పారని.. తర్వాత అతను ఫోన్ చేస్తాడని భావించానని పేర్కొన్నారు. పోలీసులు వేధించి.. దాడి చేసి హతమార్చారని ఆరోపించారు. వ్యాపారి మృతి కలకలం రేపింది.

Recommended Video

    AP Roads బాగుకై పోరాటం..YSRCP మార్క్ రాజకీయం | Oct 2nd పైనే ఫోకస్ || Oneindia Telugu
    ఖండన..

    ఖండన..

    ఘటనను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండిచారు. రాష్ట్రంలో ఎన్ కౌంటర్ కల్చర్ కొనసాగుతోందని ఆరోపించారు. అమాయకులపై దాడి చేసి.. హతమార్చడం ఏంటీ అని తప్పుపట్టారు. సీఎం ఇలాఖాలో ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని కామెంట్ చేశారు. విమర్శలు రావడంతో యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఘటనకు బాధ్యులయిన ఆరుగురు పోలీసులను విధుల నుంచి తప్పించింది. అంతేకాదు వారిపై హత్య కేసు కూడా నమోదు చేశామని వివరించారు. మృతుడి భార్యకు యోగి సర్కార్ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+