సర్కారు మెజారిటీతో నడుస్తుంది కానీ దేశానికి ఏకాభిప్రాయమే దిక్కు -అది బీజేపీనే: ప్రధాని మోదీ
ఒక పార్టీ ప్రభుత్వాన్ని నడపించడానికి తగినంత మెజారిటీ ఉంటే సరిపోతుందని, అయితే, దేశాన్ని నడిపించడానికి మాత్రం ఏకాభిప్రాయం కచ్చితంగా అవసరమే అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశాన్ని నడిపించడంలో ఏకాభిప్రాయ సాధనకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని, రాజకీయ అంటరానితనాన్ని ఏనాడూ విశ్వసించని బీజేపీ.. దేశభక్తే ప్రేరణగా పనిచేస్తుందని, బీజేపీ రాజకీయాల్లో అత్యున్నతమైనది జాతీయవాదమే అని ఉద్ఘాటించారు.
ఆర్ఎస్ఎస్ దివంగత నేత, బీజేపీ సిద్ధాంత కర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. గతంలో రాజకీయంగా అంటరాన్నితనాన్ని అనుభవించిన బీజేపీ.. తన జాతీయవాద దృక్పథంతో అందరినీ కలుపుకొంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషిచేస్తున్నదని ఆయన తెలిపారు.

రాజకీయాల కంటే జాతీయ విధానాలకే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందన్న మోదీ.. ఇటీవల కాలంలో ఆ దిశగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, మహనీయుల కలలు నెరవేరుతుండటం శుభపరిణామాలని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు సైతం ప్రభుత్వ పురస్కారాలను ప్రదానం చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 'భారత రత్న', అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్‌సీ జమీర్‌లకు పద్మ అవార్డులను ప్రదానం చేసిందని, వీరంతా కాంగ్రెస్ నేతలేనని మోదీ గుర్తుచేశారు.

''దేశభక్తే మన భావజాలానికి ప్రేరణ. దాని అంతిమ ప్రయోజనం కూడా దేశం కోసమే. బీజేపీ రాజకీయాల్లో అత్యున్నతమైనది జాతీయవాదమే. ప్రభుత్వాన్ని మెజారిటీ నడిపిస్తుందని, కానీ దేశం ఏకాభిప్రాయంతోనే నడుస్తుంది. మనం కేవలం ప్రభుత్వాన్ని నడపటానికి రాలేదు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వచ్చాం'' అని ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో..

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం.. ప్రత్యర్థి పార్టీల నేతలనేకాదు.. సుభాశ్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి జాతీయ నేతల సేవలను స్మరించుకుంటూ, ఆదరిస్తోందని, ఇతర ప్రభుత్వాలు గతంలో ఇలా చేసి ఉండేవి కాదని ప్రధాని అన్నారు. అణగారిన వర్గాలవారి సాధికారత, మానవతావాదం దీనదయాళ్ ఆదర్శాలని, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోన్న స్వయం సమృద్ధ భారత్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆయనే స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు.

-
SPG కి షాక్ ఇచ్చిన ప్రధాని! ప్రోటోకాల్ బ్రేక్, మోదీ క్షమాపణలు -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications