వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనం

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు బుధవారంతో 70వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబోమని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి. రిపబ్లిక్ డే(జనవరి 26)న హింస చోటుచేసుకున్న తర్వాత రైతులు-కేంద్ర మధ్య చర్చలు కూడా నిలిచిపోయాయి. నిరసనలు వ్యాప్తి చెందకుండా కేంద్రం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేసి, రోడ్లకు అడ్డంగా ఇనుప చువ్వలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో..

జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీజగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ

 భారత రైతులకు విదేశీ మద్దతు..

భారత రైతులకు విదేశీ మద్దతు..

ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు నిరసనలు కొనసాగిస్తుండటం, రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత ప్రభుత్వం అప్రమత్తం కావడం, నిరసనలు విస్తరించకుండా ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపేయడం, రైతుల కదలికలను పోలీసులు కట్టడం చేయడం లాంటి పరిణామాలతో ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. అవసరమైతే ఈ ఏడాదంతా ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించగా, పంతం వీడి పర్చలకు రావాలంటూ కేంద్రం ఆహ్వానించింది. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీలు, పాపులర్ ఫిగర్లు కొందరు ఢిల్లీలో రైతుల నిరసనలపై వరుస ప్రకటనలు చేశారు. రైతులకు మద్దతు పలుకుతూ, మోదీ సర్కారు తీరుపై విమర్శలు చేశారు. వారిలో..

 అంతర్జాతీయ సెలబ్రిటీల కలకలం..

అంతర్జాతీయ సెలబ్రిటీల కలకలం..

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్, వాతావరణ మార్పులపై ఉద్యమిస్తోన్న గ్రెటా థన్ బర్గ్, పాప్ స్టార రిహానా, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితరులు రైతుల ఉద్యమానికి మద్దతు పలికినవారి జాబితాలో ఉన్నారు. ముప్పేటదాడి చేసినట్లుగా గంటల వ్యవధిలోనే వీరంతా ఇండియాలో పరిణామాలపై వరుసపెట్టి ట్వీట్లు, ప్రకటనలు, విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం కలకలం రేపుతోంది. రైతుల్ని చంపొద్దంటూ మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేస్తోన్న మహిళా రైతుల ఫొటోలను షేర్ చేస్తూ.. ''వీళ్లు పెయిడ్ ఆర్టిస్టులా? కాస్టిండ్ డైరెక్టర్లు గొప్పొళ్లే మరి, బహుశా, అవార్డుల వేడుకల్లో వీళ్లనెవరూ పట్టించుకోరనే నేను నమ్ముతున్నాను. రైతులకు మద్దతు తెలుపుతున్నాను'' అని పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేర్కొన్నారు. అలాగే..

క్యాపిటల్ దాడితో పోల్చిన మీనా హ్యారిస్

క్యాపిటల్ దాడితో పోల్చిన మీనా హ్యారిస్

కొద్ది రోజుల కిందట అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారుల దాడి ఘటనను.. భారత్ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసనలకు లింకు పెడుతూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హ్యారిస్ చేసిన ట్వీట్ అంతర్జాతీయంగా వైరలైంది. పురాతన ప్రజాస్వామిక దేశమైన అమెరికాలో, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ప్రజావ్యతిరేక సంఘటనలు చోటుచేసుకున్నాయని మీనా పేర్కొన్నారు. ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై అమెరికా పాప్ సింగర్ రిహానా..''మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు'' అంటూ ప్రశ్నించారు. పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ కూడా రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. 'మేము రైతులకు సంఘీభావంగా నిలబడతాం' అంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వార్తకు సమాధానంగా ఆమె ట్వీట్ పెట్టారు. వీటిపై..

 సెలబ్రిటీలపై సెంటర్ ఫైర్

సెలబ్రిటీలపై సెంటర్ ఫైర్

ఢిల్లీలో రైతు నిరసనలపై వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సెలెబ్రెటీలు ట్వీట్లు చేయడంపై భారత విదేశాంగ శాఖ భగ్గుమంది. వాటికి ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ''సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.'' అని విదేశాంగ శాఖ పేర్కొంది.

పిరికెడు మంది రైతులే వ్యతిరేకిస్తున్నారు..

పిరికెడు మంది రైతులే వ్యతిరేకిస్తున్నారు..


వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని సమూహాలకు చెందిన రైతులు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆందోళన చేస్తున్నారని భారత్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఈ నిరసనలను దేశ ప్రజాస్వామ్య నీతి, రాజకీయ కోణంలో మాత్రమే చూడాలని తాము కోరుతున్నామని పేర్కొంది. ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి అటు ప్రభుత్వం, ఇటు రైతులు ప్రయత్నం చేస్తున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ వర్గాలతో, పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చించిన తర్వాతే చట్ట రూపం దాల్చాయని ప్రకటించింది. నూతన చట్టాలతో రైతులకు ప్రయోజనం ఉంటుందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.

కేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలుకేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

English summary
porn star mia khalifa, pop star climate campaigner Greta Thunberg, US vice president Kamala Harris niece meena harris and more foreign voices taking the farmer protest to the world with their tweets, the Indian government today put out a sharp statement warning against the "temptation of sensationalist social media hashtags and comments" and said the protests were by "a very small section of farmers" in parts of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X