• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోజుకు 9 పనిగంటలు, వారంలో ఒక రోజు సెలవు: కనీసం వేతనంపై నిర్ణయించని ప్రభుత్వం, అభిప్రాయ సేకరణ

|

న్యూఢిల్లీ: భారతప్రభుత్వం వారంలో ఒక రోజు సెలవు దినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను డ్రాఫ్ట్ వేజ్ రూల్స్‌లో తీసుకొచ్చింది. అయితే, జాతీయ కనీస వేతనం ఎంత ఉండాలనేదానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి మూడు భౌగోళిక వర్గీకరణలు సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది.

రోజుకు 9 పనిగంటలు..

రోజుకు 9 పనిగంటలు..

రోజుకు 9 పని గంటల ప్రతిపాదనపై డ్రాఫ్ట్ రూల్స్ అభిప్రాయాలను కోరింది. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలు కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. ఇదే నిబంధనలను అన్ని సంస్థలకు వర్తింపజేయాలని ప్రయత్నం జరుగుతోంది. అందుకే మేము ఈ వేజ్ కోడ్‌ను వ్యతిరేకించాం, ఈ నిబంధనలు కార్మికుల ప్రయోజనాలను గుర్తించడం లేదని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఏకే పద్మనాభన్ తెలిపారు .

కనీస వేతనంపై నిర్ణయం లేదు..

కనీస వేతనంపై నిర్ణయం లేదు..

కనీసం వేతనంపై మాత్రం లేబర్ కోడ్ స్పందించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కొందరు నిపుణులు కమిటీ దీనిపై సలహాలు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత ప్యానెల్ జనవరిలో ఈ మేరకు తన రిపోర్టులో వెల్లడించింది.

‘జూలై 2018 నుంచి రోజుకు రూ. 375 అనే మొత్తం జాతీయ కనీసీ వేతనంగా ఉండాలి' అని ప్యానెల్ పేర్కొంది. కనీస నెల జీతం రూ. 9,750కి అదనంగా హౌసింగ్ అలవెన్స్ పేరిట రూ. 1,430 కూడా నగరంలో ఉండే కార్మికులకు చెల్లించాలని స్పస్టం చేసింది.

భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) అనుబంధమైన ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ సీకే సాజి నారాయణన్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వచ్చి 70ఏళ్ల అయినప్పటికీ కనీసం వేతనం కంటే తక్కువగా ఉన్న నెల జీతం గురించే చర్చించుకుంటున్నామని అన్నారు.

రోజుకు 6 పనిగంటలకు డిమాండ్..

రోజుకు 6 పనిగంటలకు డిమాండ్..

మూడు రకాల వేతనాలున్నాయని.. వాటిలో ఒకటి కనీస వేతనం, మంచి వేతనం, జీవించే వేతనం ఉన్నాయి. 2019లో ఉన్నత ప్రమాణాలతో జీవించేందుకు లివింగ్ వేజెస్ గురించి మాట్లాడుకోవాలని అన్నారు. కొత్త ఇండియా కోసం భవిష్యత్తుపై ఆలోచన లేకుండా ఈ వేజ్ కోడ్ రూల్ ఉందని ఆరోపించారు. 8 లేదా 9 గంటల పని గంటలకు బదులు తాము 6 గంటల పని దినాలనే డిమాండ్ చేస్తున్నామని నారాయణన్ అన్నారు.

ఐదు సంవత్సరాలకు లేదా అంతకంటే తక్కువ కాలంలోనే కనీస వేతనాన్ని సవరించడం జరుగుతుందని ముసాయిదా పేర్కొంది. నెల రోజుల సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనల ఆధారంగా డిసెంబర్ నెలలో డ్రాప్ట్ రూల్ నిర్ణయించబడుతుంది.

మూడు కేటగిరీలుగా..

మూడు కేటగిరీలుగా..

కనీస వేతనం మూడు భౌగోళిక వర్గీకరణలను బట్టి నిర్ణయించబడుతుందని డ్రాఫ్ట్ రూల్ తెలిపింది. 40 లక్షలు లేదా అంతకంటే జనాభా ఎక్కువ ఉన్న మెట్రో నగరాలు, 10 లక్షల నుంచి 40 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలను నాన్ మెట్రో నగరాలుగా, మిగితా ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరించారు. నగరాల్లో జీవించే ప్రజల కనీస వేతనంలో 10శాతం అద్దె ఉంటుందని డ్రాఫ్ట్ రూల్ చెబుతోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లేవారి సంఖ్య మనదేశంలో రోజు రోజుకు చాలా పెరిగిపోతోంది. ఇంటి అద్దె 10శాతం, ఆహారం, బట్టల ఖర్చులు ఈ రోజుల్లో చాలా పెరిగిపోయాయి.

కనీస వేతనం పెంచాలి..

కనీస వేతనం పెంచాలి..

పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఇతర ఖర్చులు కనీస వేతనంలో 20శాతం ఉంటాయని అంచనా వేస్తోంది డ్రాప్ట్ రూల్. రోజుకి 2700 కేలరీస్, ఒక కుటుంబానికి ఏడాదికి 66 మీటర్స్ బట్టలను డ్రాఫ్ట్ర పరిగణలోకి తీసుకుంటోంది. కాగా, 1957 తొలిసారి కనీసం వేతనం లెక్కించిన విధానమే ఇప్పటికీ అమలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ లెక్కలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలనే అంతర్గత కమిటీ సూచించింది. వర్కర్, భాగస్వామి, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మొత్తం ఆరుగురిని యూనిట్‌గా పరిగణలోకి తీసుకోవాలని నారాయణన్ స్పష్టం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian government has suggested a nine-hour normal working day in its draft wage code rules, but has stayed away from fixing a national minimum wage. The draft reiterates most of the old rules except suggesting three geographical classifications for deciding wages in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more