వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానానికి గడువు పొడిగింపు, మార్చి 31 వరకు గడువు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌ గుర్తింపు కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఆధార్‌కార్డుతో పాన్‌కార్డు అనుసంధానం చేసే గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ గడువును 2018 మార్చి 31 వ, తేది వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

Recommended Video

Centre Plans To Link Driving Licence To Aadhaar Card | Oneindia Telugu

ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Govt tells SC: Ready to extend Aadhaar-PAN linking deadline till 31 March


ఆధార్‌,పాన్‌ లింకింగ్‌ గడువును 2018, మార్చి 31 వరకు పెంచుతున‍్నట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కాగా ఆదాయపు పన్ను దాఖలుకోసం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఆధార్‌ నంబర్ జతచేయడాన్ని తప్పని సరి చేసింది.

మరో వైపు ఆధార్‌పై దాఖలైన వ్యాజ్యాల విషయమై వచ్చే వారంలో సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అయితే మొబైల్ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేసుకొనేందుకు కూడ 2018 ఫిబ్రవరి వరకు గడువును విధిస్తు కేంద్రం నిర్ణయం తీసుకొంది.

English summary
The Centre on Thursday informed the Supreme Court that it was willing to extend till 31 March next year the deadline fixed for mandatory linking of Aadhaar for availing of various services and welfare schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X