బిడ్డను చంపుకుంటానా?: లాలూతో తెగతెంపులపై నితీష్ ట్విస్ట్

ఆర్జేడీ - జేడీయూ మధ్య విభేదాల్లో కొత్త ట్విస్ట్. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరు ఊహించిన దానికి భిన్నంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్, జెడియూ, ఆర్జేడీ పొత్తు అలాగే ఉంటుందని చెప్పారు. విభేదాలేమీ లేవన్నారు.

పాట్నా: ఆర్జేడీ - జేడీయూ మధ్య విభేదాల్లో కొత్త ట్విస్ట్. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరు ఊహించిన దానికి భిన్నంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్, జెడియూ, ఆర్జేడీ పొత్తు అలాగే ఉంటుందని చెప్పారు. విభేదాలేమీ లేవన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్‌తో దోస్తీ ఉంటుందని నితీశ్ స్పష్టం చేశారు. లాలూతో కలసి పెంచుకున్న బిడ్డే గ్రాండ్ అలయెన్స్ అని చెప్పారు. తన బిడ్డను తానే ఎలా చంపుకుంటానని ప్రశ్నించారు.

Grand alliance won’t break, it’s our baby, says Nitish Kumar

అంతకుముందు నితీష్ ఏఐసీసీ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడారు. లాలూతో తెగతెంపులు లేవని చెప్పారు.

కాగా, లాలూ కుటుంబంపై సీబీఐ దాడులు, అంతకన్నా ముందు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌ను కాదని, ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు మద్దతు పలకడం తదితర పరిణామాలతో నితీశ్, లాలూ మధ్య బంధం వీడనుందని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత బిజెపి మద్దతుతో నితీశ్ ప్రభుత్వం కొనసాగుతుందని భావించారు. అయితే, లాలూ ఇళ్లపై సీబీఐ దాడులు మొదలైన తర్వాత తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నితీశ్ ఏర్పాటు చేయగా, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+