జిఎస్టీ ద్వారా సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఆదాయం రూ.92,150
కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీఎస్టీని అమలులోకి తెచ్చింది. ముగిసిన సెప్టెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.92,150కోట్ల ఆదాయం లభించింది.
42.91లక్షల వ్యాపారాల ద్వారా ఈ మొత్తం లభించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వివరాలు తెలిపింది. ఇందులో రూ.14,042 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.21,172 కోట్లు స్టేట్ జీఎస్టీ. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.48,948 కోట్లు, దిగుమతుల కింద రూ.23,951 కోట్లు వచ్చాయి.

కాగా, ఈ ఏడాది జులైలో జీఎస్టీ అమల్లోకి రాగా మొదటి నెలలో రూ.95వేల కోట్లు, రెండో నెలలో రూ.91వేల కోట్లు వచ్చాయి. ఇప్పుడు రూ.92 వేల కోట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications