వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: కార్ల ధరలు ఇలా మారబోతున్నాయి!, ఎవరికి మేలు..

జీస్టీతో వాహనాలపై పన్ను రేటు 28శాతం కానుండటంతో.. చిన్న కార్ల ధరలు కూడా రూ.1లక్షకు వెయ్యి చొప్పున పెరిగే అవకాశం ఉండవచ్చు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వాహన రంగంపై ఏవిధమైన ప్రభావం చూపనుందనే చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది. జీఎస్టీతో మధ్య తరగతి జీవులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడుతాయని తెలుస్తుండగా.. వాహన రంగంపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తి అటు పారిశ్రామిక వర్గాల్లోను ఇటు మధ్య తరగతి జనంలోను నెలకొంది.

జీఎస్టీ ప్రవేశంతో కొన్ని పెద్ద కంపెనీలకు చెందిన కార్ల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుతో పోల్చుకుంటే, ప్రతిపాదిత పన్ను రేటు, సెస్ కలిపినా.. మొత్తం పన్ను విలువ తక్కువగానే ఉన్నందునా.. కొన్ని లగ్జరీ కార్ల ధర తగ్గవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తక్కువ పొడవుండే కార్లు:

తక్కువ పొడవుండే కార్లు:

అదే సమయంలో.. 4మీటర్ల కంటే తక్కువ పొడవుండే చిన్న కార్ల ధరలు స్వల్ప స్థాయిలో పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక క్యాబ్ లపై విధిస్తున్న సర్వీస్ ట్యాక్స్ ను తగ్గించినందువల్ల.. ఈ రంగం మరింత వృద్ధి రేటును నమోదు చేసే అవకాశముంది.

సీసీ సామర్థ్యాన్ని బట్టి పన్ను:

సీసీ సామర్థ్యాన్ని బట్టి పన్ను:

ఇక వాహనాల సీసీ సామర్థ్యాన్ని బట్టి కూడా వాటి పన్ను రేట్లు నిర్ణయం కానున్నాయి. 350సీసీ కన్నా అధిక సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై 31శాతం పన్ను విధించవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై విధిస్తున్న 7శాతం పన్నును ఇప్పుడు 12శాతం మేర పెరగనున్నాయి. ఎయిర్ కండిషనర్లపై 1శాతం మేర పన్ను పెరనుంది.

స్పోర్ట్ వాహనాల ధరలు తగ్గవచ్చు:

స్పోర్ట్ వాహనాల ధరలు తగ్గవచ్చు:

మరోవైపు స్పోర్ట్స్ వినియోగ వాహనాల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీతో వాటిపై పన్ను భారం తగ్గనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదే సమయంలో 4మీటర్ల కంటే పొడవుండే సెడాన్ వంటి కార్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశముంది.

వాహనాలపై 28శాతం పన్ను:

వాహనాలపై 28శాతం పన్ను:

కాగా, జీఎస్టీ ప్రవేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో విధిస్తున్న 10రకాల పన్నులు.. ఒకే పన్నుగా మారనున్నాయి. జులై1 నుంచి అమలయ్యే జీఎస్టీలో 5,12,18,28 శాతాలుగా ఉండే 4రకాల పన్నులు అమలవుతాయి. కార్లకు 28శాతం మేర పన్ను అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం చిన్నకార్లకు 12.5 శాతం కేంద్ర ఎక్సైజ్‌ ట్యాక్స్ అమలవుతోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరో 14.5-15 శాతం వ్యాట్ విధిస్తున్నారు. ఈ లెక్కన చిన్న కార్లపై 27.0-27.5 పన్ను అమలవుతోంది.

పెరగనున్న చిన్న కార్ల ధరలు:

పెరగనున్న చిన్న కార్ల ధరలు:

జీస్టీతో వాహనాలపై పన్ను రేటు 28శాతం కానుండటంతో.. చిన్న కార్ల ధరలు కూడా రూ.1లక్షకు వెయ్యి చొప్పున పెరిగే అవకాశం ఉండవచ్చు. వాహనాలపై విధించే పన్ను కాకుండా.. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ను బట్టి 1-3శాతం సెస్ అమలులోకి వస్తుంది. ఇక ఇంజిన్ సామర్థ్యం 1,500 సీసీ కంటే అధికంగా ఉండే పెద్ద కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీ)లకు కేంద్రం 41.5-44.5 శాతం పన్ను విధిస్తోంది.

కొత్త ట్యాక్స్‌తో 43శాతం పన్ను:

కొత్త ట్యాక్స్‌తో 43శాతం పన్ను:

ఇందులో కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ 27-30శాతం కాగా వ్యాట్ 14.5శాతం అమలు అవుతోంది. పూర్తిగా దిగుమతి చేసుకునే వాహనాలకు 52-55శాతం పన్ను అమలవుతోంది. జీఎస్టీలో పన్నురేటు 28శాతం కావడంతో 15శాతం మేర సెస్ కలుపుకుంటే మొత్తం 43శాతం పన్ను అమలవుతుంది. దీంతో కొన్ని వాహనాల ధరలు స్వల్పంగా తగ్గే అవకాశముంది.

English summary
as far as the effects of the Goods and Services Tax (GST) on cars. While Finance Minister, Arun Jaitley, made it quite clear that the GST rate on all passenger cars will be fixed at 28 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X