గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... కారు-ట్రక్కు ఢీ... 10 మంది అక్కడికక్కడే మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో తారాపూర్-వతమాన్ హైవేపై ఇంద్రనాజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో మృతి చెందినవారంతా కారులో ఉన్నవారేనని తారాపూర్ పోలీసులు తెలిపారు. మొత్తం 10 మంది మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు వతమాన్ వైపు వెళ్తుండగా... ట్రక్కు ఎదురుగా వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే చిక్కుకుపోయాని తెలిపారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

 gujarat 10 killed on the spot after car truck collided

Recommended Video

    Happy birthday Nandamuri Balakrishna: Twitter lights up as fans and celebs celebrate actor's day

    రెండు నెలల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏకంగా 15 మంది మృతిచెందారు. పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి ఓ భారీ ట్రక్కు వారిపై దూసుకెళ్లడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో పొట్టకూటి కోసం రాజస్తాన్ నుంచి వలస వచ్చిన కూలీలు కూడా ఉన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా కోసంబి పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+