రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా బస్సు బోల్తా: 35మందికి గాయాలు, 20మంది సీరియస్

Subscribe to Oneindia Telugu

బర్డోలి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పిన సంఘటనలో 35 మంది గాయపడ్డారు. ఇందులో 20మంది పరిస్థితి విషమంగా ఉంది. గుజరాత్‌లోని నర్మద జిల్లాలోని దేడియపడాలో సోమవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది.

ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీలో పాల్గొనేందుకు మద్దతుదారులతో బయలు దేరిన బస్సు తాపీ జిల్లాలోని కంజా గ్రామం సమీపంలో మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది.

Gujarat: 35 injured as bus on way to Rahul Gandhi rally overturns

ఈ ప్రమాదంలో బస్సులోని 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బర్డోలి ప్రభుతాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thirty-five people were injured on Monday, 20 of them seriously, when a bus overturned at Kanja village in Tapi district of Gujarat, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి