Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ ముందు తల వంచుతున్నా- ప్రధాని మోదీ భావోద్వేగం..!!

అహ్మదాబాద్/సిమ్లా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిందే జరుగుతోంది. ఇక్కడ వార్ వన్ సైడ్ అయింది. భారతీయ జనత పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించింది. థంపింగ్ విక్టరీని అందుకుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా దిమ్మతిరిగే స్థాయిలో అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సైతం ఓడిపోయారు.

గుజరాతీయులు కాంగ్రెస్, ఆప్‌లను ఘోరంగా తిరస్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. బీజేపీకి గంపగుత్తగా ఓటు వేశారు. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ- 156 చోట్ల విజయాన్ని దక్కించుకుంది. ఈ స్థాయి విజయం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ నమోదు కాలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు కూడా ఇన్ని సీట్లు బీజేపీకి రాలేదు.

Gujarat and Himachal Pradesh Elections Result 2022: I bow to Gujarat’s Jan Shakti, tweeted PM Modi

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఘన విజయం సాధించారు. తమ ప్రత్యర్థులపై తిరుగులేని మెజారిటీని సాధించారు. భూపేంద్ర పటేల్ ఏకంగా 1,07,960 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అమీ యజ్ఞిక్‌ను ఓడించారు. పటిదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కూడా భారీ మెజారిటీని సాధించారు. వీరంగామ్ నుంచి ఆయన గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ గానీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గానీ నామమాత్రంగా మిగిలాయి. దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల మోదీ స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుగులేని ఈ ఎన్నికల ఫలితాలు తనను భావోద్వేగానికి గురి చేస్తోన్నాయని, గుజరాతీయులు ఎప్పుడూ అభివృద్ధితో సమ్మిళితమైన రాజకీయాల వైపే మొగ్గు చూపుతారని మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు.

గుజరాత్ ప్రజలు చూపించిన అభిమానానికి తాను తల వంచుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడున్న అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని వారు కోరుకుంటున్నారనేది ఈ ఫలితాలు తేల్చాయని అన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ విజయం ప్రతి కార్యకర్తకు దక్కుతుందని, వారందరూ ఛాంపియన్లేనని చెప్పారు. కార్యకర్తలు లేకపోతే ఈ స్థాయి విజయం సాధ్యపడేది కాదని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు కూడా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+