వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు: 70 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా, 35 మంది ఎమ్మెల్యేలకు నో చాన్స్ !

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యంత్రి నితిన్ పటేల్ తో సహ 70 మంది శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఆ పార్టీ విడుదల చేసింది.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యంత్రి నితిన్ పటేల్ తో సహ 70 మంది శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఆ పార్టీ విడుదల చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరోసారి సీఎం అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Recommended Video

Gujarat Assembly Elections: Narendra Modi Campaign | Oneindia Telugu

గుజరాత్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం, 33 జిల్లాలు, 182 స్థానాలు, ఆ రెండు విషయాల్లో!గుజరాత్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం, 33 జిల్లాలు, 182 స్థానాలు, ఆ రెండు విషయాల్లో!

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజ్ కోట్ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జైన్ మతానికి చెందిన విజయ్ రూపాని బీజేపీ గుజరాత్ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. విజయ్ రూపాని ఎంపీగాను సేవలందించారు.

Gujarat Assembly election 2017 BJP announces list 70 candidates

గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహ్సనా శాసన సభ నియెజక వర్గం, జీతు వగాని భావ్ నగర్ పశ్చిమ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 18, 19వ తేదీల్లో బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేస్తారని ఇంత వరకూ ప్రచారం జరిగింది.

గుజరాత్ ఎఫెక్ట్: బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ మాజీ స్నేహితుడు, దేశద్రోహం కేసులో జైలు !గుజరాత్ ఎఫెక్ట్: బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ మాజీ స్నేహితుడు, దేశద్రోహం కేసులో జైలు !

అయితే ఒక్క రోజు ముందుగానే బీజేపీ నాయకులు మొదటి విడత జాబితాను విడుదల చేశారు. గుజరాత్ లో డిసెంబర్ 9, 14వ తేదీల్లో రెండు విడతలుగా శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం బీజేపీ విడుదల చేసిన 70 మంది జాబితాలో 45 మంది మొదటి విడత (డిసెంబర్ 9), 25 మంది రెండో విడత (డిసెంబర్ 14) లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గుజరాత్ లో గత 22 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీకి 121 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారిలో 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించడానికి అధిష్టానం నిరాకరించింది. అంతే కాకుండా 6 మంది మంత్రులు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.

English summary
On Friday, a list of 70 candidates was officially declared by the Bharatiya Janata Party. Chief Minister Vijay Rupani is contesting from Rajkot West seat. Deputy Chief Minister Nitin Patel is from Mehsana and Jitu Vagani Bhavnagar is contesting from the west
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X