వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ-షా డబుల్ ఇంజిన్ సర్కార్ సత్తాకు అసలు పరీక్ష..!!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధమైంది. గురువారమే తొలి విడత పోలింగ్. ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. 5వ తేదీన మలి విడత పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారతీయ జనత పార్టీ అధికారంలో ఉంది. ఈ దఫా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది 8వ తేదీన తేలిపోతుంది.

తొలి విడతలో..

తొలి విడతలో..

గుజరాత్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్‌, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ ఉంటుంది. తొలి విడతలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,1,5,42,811 మంది మహిళలు, 497 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

89 స్థానాల్లో..

89 స్థానాల్లో..

తొలి దశ 89 స్థానాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 718 మంది పురుషులు, 70 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ చేస్తోన్నాయి. తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో పోటీకి దిగింది. ఈ మూడింటితో పాటు మరో 39 ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

ముఖ్యమంత్రికి అగ్నిపరీక్ష రేపే..

ముఖ్యమంత్రికి అగ్నిపరీక్ష రేపే..


తొలి దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న అభ్యర్థుల జాబితా పెద్దదే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పోటీలో ఉన్న ఘట్లోడియా స్థానానికీ రేపే పోలింగ్ జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గఢ్వీ పోటీలో ఉన్న ఖంభాలియా, బీజేపీ తరఫున హార్దిక్ పటేల్ పోటీ చేసిన వీరంగామ్ నియోజకవర్గాలు తొలి విడత జాబితాలోనే ఉన్నాయి. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీలో ఉన్న జామ్‌నగర్ నార్త్, ఆప్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా భవితవ్యం తేలేది రేపటి పోలింగ్‌తోనే.

అదనపు బలగాలు..

అదనపు బలగాలు..

కాగా- సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఎన్నికల అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను తీసుకున్నారు. పలు కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

డబుల్ ఇంజిన్ సర్కార్..

డబుల్ ఇంజిన్ సర్కార్..

గుజరాత్‌- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. పైగా నాలుగు దఫాలుగా ఈ పార్టీనే అధికారంలో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా గెలిస్తే వరుసగా అయిదోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్టవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది బీజేపీ. క్రమంగా సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.

English summary
Gujarat Assembly elections 2022: All set to first phase polling in 89 seats, check the details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X