అందుకే అమిత్‌ షా డోర్ టు డోర్: ప్రచారంతో అప్పుడే వ్యూహం మొదలుపెట్టేసారు.

Posted By:
Subscribe to Oneindia Telugu
Gujarat Assembly Eections: Amit Shah Kicks Off Door-To-Door Campaign

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని దూకుడు అవతారాన్ని ఎదుర్కోవటానికి బిజెపి ప్రతినిధి బృందం, గుజరాత్ రాష్ట్రం లోని ఇంటీంటి లోని ప్రతి ఓటరుకు చేరుకునే ఉద్దేశ్యంతో పార్టీ డోర్-టు-డోర్ ప్రచారాన్ని ప్రారంభించింది.

గుజరాత్ గౌరవ్ మహాసంపర్క్ అభియాన్ పేరుతో, అమిత్ షా తో పాటు అనేక కేంద్ర మంత్రులు నవంబర్ 7 నుండి 12 వరకు ఆరు రోజుల పాటు డోర్-టు-డోర్ ప్రచారాన్ని నడుపుతారు, ఐతే అహ్మదాబాద్ నరన్పురా నుండి దీనిని ప్రారంభించారు.కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 9 న గుజరాత్ గౌరవ్ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం లో చేరతారని ఊహాగానాలున్నాయి. ఐతే దేశంలో రెండు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌, మరొకటి గుజరాత్‌. అయితే అందరి దృష్టి గుజరాత్‌పైనే ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆ రాష్ట్రానికి చెందిన నాయకులే. వీరిద్దరూ అంతకు ముందు గుజరాత్‌లో సిఎం, హోం మంత్రులుగా ఉన్నారు. అయితే వీరు ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత గుజరాత్‌లో జరిగే తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో బిజెపికి గెలుపు అత్యవసరం. ఎందుకంటే బిజెపికి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో ఓటమి పాలైనట్లయితే, సమీప భవిష్యత్తులో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ bjp కి ఇబ్బందులు తలెత్తోచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party National President Amit Shah on Tuesday started party’s door-to-door campaign in Ahmedabad’s Naranpura district in Gujarat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి