గుజరాత్ తుది పోలింగ్: స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కే అవకాశం

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 9న ముగియగా.. రెండో దశ ఎన్నికలు గురువారం(డిసెంబర్ 14) జరుగుతున్నాయి. కాగా, మొత్తం 182స్థానాలకు గానూ తొలి దశలో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. రెండో దశలో 14జిల్లాలోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరగుతోంది.

అయితే, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా కనిపిస్తోంది. ఎందుకంటే.. అప్పుడు బీజేపీ విజయం నల్లేరుపై నడకగా సాగింది. కానీ, ఇప్పుడు అలా లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఇందుకు పటేళ్ల ఉద్యమ నేత హార్ధిక్ పటేల్, ఇతర యువనేతలు అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా కారణంగా తెలుస్తోంది.

Gujarat Assembly elections: In final round today, BJP defends narrower leads than in first

తాజాగా తొలి దశలో జరిగిన ఎన్నికల్లో 83స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. గురువారం జరిగే రెండో దశ ఎన్నికల్లో కూడా బీజేపీకి కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర, పశ్చిమ, సెంట్రల్ గుజరాత్‌లలో చాలా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓపీనియన్ పోల్స్ గుజరాత్ రాష్ట్రంలో అధికారం మళ్లీ బీజేపీదే అని చెప్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకుని స్వల్ప తేడాతో అధికారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+