వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ పోల్:ఆప్ పోటీ కాదు, కాంగ్రెస్‌తోనే పోటీ: అమిత్ షా, వచ్చే 10 ఏళ్లు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు ధీాతో ఉన్నాయి. బీజేపీ-కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండగా.. మధ్యలో ఆప్ కూడా వచ్చింది. పంజాబ్‌లో విజయంతో గుజరాత్‌పై కూడా హోప్స్ పెట్టుకుంది. కాన ఓటరు నాడీ ఎలా ఉండనుందో చూడాలీ. గుజరాత్‌లో విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్‌లో బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. ఆప్ తమకు పోటీ కాదని తేల్చిచెప్పారు. 1990 నుంచి గుజరాత్‌లో సింగిల్ ఎన్నికలో తమ పార్టీ ఓడిపోలేదని తెలిపారు. గుజరాత్ ప్రజలు తమను ఎప్పుడూ దీవిస్తూనే ఉన్నారని తెలిపారు. ఫలితాల రోజునే తెలుస్తోంది.. అదీ త్రిముఖ పోటా..? ద్విముఖ పోరా అని వివరించారు.

Gujarat Assembly polls:competition congress only not aap: Amit Shah

తమ పార్టీ ఎవరినీ నిందించదని పేర్కొన్నారు. కానీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే దానిని స్పష్టం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వివరించారు.

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, వినాయకుడి ప్రతిమ ముద్రించాలని ఆప్ కోరుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అమిత్ షా స్పందిస్తూ.. ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందిందని.. వాటిని రాజకీయ నేతలు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది ఎజెండా తమను పక్కదారి పట్టించలేదన్నారు.

గత 27 ఏళ్ల నుంచి గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలో ఉందని గుర్తుచేశారు. వచ్చే 10 ఏళ్లలో ఏం చేయబోతున్నామనే అంశానికి సంబంధించి తమకురోడ్ మ్యాప్ ఉందని చెప్పారు. తాము ఏ పార్టీని వ్యతిరేకించడం లేదని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో డెవలప్ జరుగుతుందని వివరించారు.

English summary
Union Home Minister Amit Shah has said that the fight in Gujarat Assembly polls is between the Congress and the BJP, dismissing the Aam Aadmi Party as potential rival in the upcoming polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X