గుజరాత్‌లో బీజేపీపై ప్రజాగ్రహం? ముప్పును పసిగట్టిన కాషాయదళం, కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఆయనేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. శనివారం అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు విస్తృతంగా ప్రచారం చేసిన కమలం పార్టీని అక్కడి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఆందోళనకు గురిచేస్తోంది.

  Gujarat Assembly Election Opinion Poll : Congress Gains Ground

  చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదని గుజరాత్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన కాషాయదళం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నెగ్గేందుకు రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది.

  దేశం కోసమే మోడీ కఠిన నిర్ణయాలు...

  దేశం కోసమే మోడీ కఠిన నిర్ణయాలు...

  గుజరాత్‌లో రెండు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.
  ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీ గెలవడం ముఖ్యమని, ఆయన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నందువల్ల తాత్కాలిక కష్టాలు వచ్చాయని ఆ పార్టీ చెబుతోంది.

  కాంగ్రెస్ గెలిస్తే మతకల్లోలాలే...

  కాంగ్రెస్ గెలిస్తే మతకల్లోలాలే...

  ఇది గుజరాత్ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని, గుజరాతీయులందరూ ఏకం కావాలనే ప్రచారం కూడా ఉధృతంగా సాగుతోంది. గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ మత కల్లోలాలు జరుగుతాయని, హిందువులు మైనారిటీలో పడిపోతారని చాపకింద నీరులా ప్రచారం సాగుతోంది.

  ప్రచారానికి రావద్దని కోరుతూ బ్యానర్లు...

  ప్రచారానికి రావద్దని కోరుతూ బ్యానర్లు...

  బీజేపీ ఆత్మగౌరవ ప్రచారానికి గుజరాతీయులు ఏమాత్రం స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ చెబుతున్నవన్నీ ఇంతకుముందు వాడేసిన కార్డులేనని, చాలా చోట్ల చేసిన వాగ్ధానాలను నెరవేర్చలేదనే ఆగ్రహంతో నేతలను ప్రచారానికి రావద్దని కోరుతూ బ్యానర్లు పెడుతున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గాలని, తాగునీరు కావాలని, పక్కా రోడ్లు వేయాలని ప్రజలు అధికంగా డిమాండ్ చేస్తున్నారు.

  హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకునే పనిలో...

  హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకునే పనిలో...

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ వైపు హిందువులను మచ్చిక చేసుకునేందుకు గుజరాత్‌లోని పలు దేవాలయాలను సందర్శిస్తూనే, మరోవైపు ముస్లింలను ఆకట్టుకునేందుకు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

  కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అహ్మద్ పటేల్?

  కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అహ్మద్ పటేల్?

  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ఓ పోస్టర్‌ను కూడా వేశారు. ఈ పోస్టర్‌లో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు. వీరి ఫొటోల క్రింద గుజరాతీలో ఓ విజ్ఞప్తి ఉంది. ‘ముస్లింల ఐక్యతను కాపాడేందుకు, గుజరాత్‌ మహా మంత్రిగా అహ్మద్ పటేల్‌ను చేసేందుకు కాంగ్రెస్‌కు మాత్రమే ఓటు వేయాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నాం..' అని అందులో రాసి ఉంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As polling begins in Gujarat in just two days, BJP is trying to retain it's power in the Prime Minister Modi's home state. But people of the Gujarat is on fire against BJP Government as they are not fulfil their promises. On the other hand Congress under it's President-elect Rahul Gandhi and his grand alliance trying to convert both religions hindu and muslim votes towards their party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి