ప్రసంగిస్తూనే కుప్పకూలిపోయిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ: అప్రమత్తమైన సెక్యూరిటీ
గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వడోదరలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కిందపడిపోకుండా పట్టుకున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వేదికపై పడిపోవడంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, విజయ్ రూపానికి లో-బీపీ రావడం వల్లే కళ్లు తిరిగి పడిపోయారని బీజేపీ నేతలు వెల్లడించారు.

పరీక్షించిన వైద్యులు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు తెలిపారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్ వెళ్లిపోయారు. కాగా, విజయ్ రూపానికి శనివారం నుంచి కొంత అస్వస్థతగా ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరుసగా ప్రచారాలు నిర్వహిస్తున్నారని తెలిపాయి.
वडोदरा में चुनावी सभा में भाषण करते वक्त @CMOGuj @vijayrupanibjp मंच पे गिर पड़े बताया जा रहा अचानक रुपानी को चककर आ गया
— Nirnay Kapoor (@nirnaykapoor) February 14, 2021
विजय रुपाणी की तबियत अब ठीक बताई जा रही है उनका इलाज कर रहे डॉक्टर्स के अनुसार लगातार स्ट्रेस के कारण उनका BP लो हो गया था @indiatvnews pic.twitter.com/TkPKn0jXIY
అయితే, ముఖ్యమంత్రికి మెరుగైన చికిత్స అందించిన తరవ్ాత ఆయనే స్వయంగా నడుచుకుంటూ వచ్చి కారులో వెళ్లారని వైద్యులు తెలిపారు. సీఎం స్టేజిపైనే పడిపోయిన సమయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు కూడా వేదికపై ఉన్నారు.
Recommended Video
కాగా, గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. నిజాంపుర, కరేలీబాగ్, తార్సాలీ ప్రాంతాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. తాజాగా, సభలో మాట్లాడుతుండగానే సీఎం విజయ్ రూపానీ పడిపోవడంతో ఇప్పుడు ఆరోగ్యం పరిస్థితి చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications