ఆ స్టేడియానికి మోడీ పేరు తీసేస్తాం- గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీతో విపక్ష కాంగ్రెస్ హోరాహోరీ పోరాడుతోంది. మూడు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా గద్దె దించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని తిరగతోడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియం పేరును మార్చి గతంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోడీ పేరు పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఇది నరేంద్రమోడీ స్టేడియంగానే పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో దీని పేరును తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని హామీ ఇస్తోంది. అంతే కాదు అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ మ్యానిఫెస్టో అమలుచేస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తి రేపుతోంది.

గుజరాత్ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో లక్షల సంఖ్యలో ఉన్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇందులో స్టేడియం పేరు మార్పుతో పాటు పలు అంశాలున్నాయి. గుజరాత్ లో తమకు అధికారమిస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు మహిలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్, అలాగే నెలకు ఒంటరిగా ఉండే ప్రతీ మహిళకు, వితంతువులకు, వృద్ధులకు రెండువేల సాయం వంటివి ఉన్నాయి.












Click it and Unblock the Notifications