నాడు బీజేపీ కంచుకోట సూరత్: డైమండ్ ట్రేడర్స్‌లో ఆగ్రహం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

సూరత్: దేశ భవితవ్యాన్ని నిర్దేశించే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు, మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. డైమండ్ హబ్‌గా సూరత్‌ పెట్టింది పేరు.గతేడాది నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్లు రద్దు చేయడంతోపాటు ఈ ఏడాది జూలై ఒకటో తేదీన జీఎస్టీని ఆదరాబాదరా అమలు చేయడంతో వజ్ర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూరత్ నగరంలో వరచ్చా ప్రాంతంలోని శ్రీ సర్దార్ పటేల్ మార్కెట్ వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు. మెరుగులు దిద్దిన వజ్రాభరణాల నిలయం సూరత్ సిటీ. వ్రజాభరణాల బిజినెస్ మీడియేటర్ దినేశ్ భాయి పటేల్ మాట్లాడుతూ గతేడాది రూ.18 వేల విలువ గల వజ్రాలు, ఈ ఏడాది రూ.15 వేలకే లభిస్తున్నాయని అన్నాడు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని, కానీ ప్రస్తుతం ప్రతి దానికి బిల్లు అవసరమని పేర్కొన్నాడు.

తొలుత నోట్ల రద్దు, తర్వాత జీఎస్టీ తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. తాము చాలా పేపర్ వర్క్ చేయాల్సి వస్తున్నదని తెలిపాడు. నాటి నుంచి వ్యాపారం ప్రతికూల పరిస్థితి ఏర్పడిందన్నాడు. నిరక్షరాస్యులు కావడంతో లాభాలు గడించలేకపోతున్నామని చెప్పాడు. వరచ్చా రోడ్ నియోజకవర్గ పరిధిలో 2.03 లక్షల మంది ఓటర్లు ఉంటే 1.74 లక్షల మంది పాటిదార్లు ఉన్నారు. బీజేపీకి కంచుకోటగా నిలిచిన సూరత్ సిటీ. దినేశ్ భాయి వంటి వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

ఎమ్మెల్యే కుమార్ కనానీ వర్సెస్ ధిరూ గజేరా మధ్య గట్టిపోటీ

ఎమ్మెల్యే కుమార్ కనానీ వర్సెస్ ధిరూ గజేరా మధ్య గట్టిపోటీ

ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కుమార్ కనానీకి, 1995 నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధిరు గజేరా మధ్య గట్టిపోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రవీణ్ తొగాడియా బంధువు ప్రఫుల్ తొగాడియాను తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గజేరాకు మాత్రమే చాన్స్ లభించింది. ప్రఫుల్ తొగాడియా కూడా నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ శక్తిమంతంగా నిలుస్తుందన్నారు. కతార్గాం, వరచ్చా రోడ్, కరాంజ్‌తోపాటు సూరత్ అసెంబ్లీ స్థానాల్లో హార్దిక్ పటేల్ ప్రభావం కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏనాడూ బహిరంగ సభ నిర్వహించగల సామర్థ్యం కలిగి లేదు. కానీ ఈ దఫా ఆ పని చేయగలిగిందని అన్నాడు. మూడు వారాల క్రితమే కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగిందని గుర్తు చేశారు. ఈ నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పాటిదార్ల ఆధిపత్యంలో వెల్లువెత్తిన నిరసనలు అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోనున్నదని చెబుతున్నారు.

పెద్ద వ్యాపారులకు నష్టమేమీ లేదని వ్యాఖ్యలు

పెద్ద వ్యాపారులకు నష్టమేమీ లేదని వ్యాఖ్యలు

దినేశ్ భాయి వంటి వాస్తవంగా అమ్రేలీ నుంచి వలస వచ్చిన రైతు. 20 ఏళ్లుగా వ్రజాభరణాల వ్యాపార మధ్యవర్తిగా ఉన్నాడు. తాము పన్ను చెల్లింపుతోపాటు రెండు శాతం ఆదాయం సాధిస్తున్నామని అన్నారు. భావ్ నగర్ నుంచి వలస వచ్చిన మరో సురేశ్ భాయి పటేల్ అనే మధ్యవర్తి కూడా జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారుల లావాదేవీలు దెబ్బ తిన్నాయన్నారు. జీఎస్టీ వల్ల ప్రతి నెల ఆదాయం రూ.10 వేలు పడిపోయాయని సురేశ్ భాయి పటేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. జీఎస్టీ వల్ల పెద్ద వ్యాపారులకు జరిగే నష్టమేమీ ఉండదని తెలిపాడు. పెద్ద వ్యాపారుల చెల్లింపులన్నీ కాగితాల్లోనే సాగుతాయని, కొనుగోళ్లకు చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో జరిగిపోతాయన్నారు. దీనికి తోడు పెద్ద పెద్ద బిజినెస్‪లకు బీమా సౌకర్యం కూడా ఉంటుందని గుర్తు చేశారు.

హార్దిక్ పటేల్ చుట్టు ఉన్నవారు మంచోళ్లు లేరు

హార్దిక్ పటేల్ చుట్టు ఉన్నవారు మంచోళ్లు లేరు

వరచ్చా మార్కెట్ ప్రాంతంలో సుమారు 80 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఉన్నాయి. వాటి పరిధిలో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో 75 శాతం మంది సౌరాష్ట్ర ప్రత్యేకించి అమ్రేలీ, భావ్ నగర్ ప్రాంతాల వాసులు ఉన్నారు. 18 నెలల క్రితం ఎంబ్రాయిడరీ వర్క్ నుంచి వజ్రాభరణాల బిజినెస్‌లోకి మారారు ఘన్‌శ్యామ్ పటేల్. తాము చేసే వ్యాపారాల నుంచి ఆదాయం సంపాదించాలని ప్రభుత్వం భావిస్తోందని, ఒకవేళ మా బిజినెస్ విఫలమైతే ఎవరు జవాబుదారీ అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. వజ్రాల వ్యాపారులంతా సంపన్నులన్న భావన కేవలం భ్రమ మాత్రమేనని చెప్పారు. అయితే ఘన్ శ్యామ్, సురేశ్ భాయి వంటి వారు బీజేపీకే ఓటేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 80 శాతం మంది ప్రజలు స్కూల్ కు వెళ్లని వారే ఉన్నారు. వారంతా వేధింపులకు గురైనట్లు భావిస్తున్నారు. కానీ పాటిదార్లు మాత్రం బీజేపీకి ఓటేస్తారన్నారు. పాటిదార్ల ఆందోళనకు మద్దతు పలికినా.. హార్దిక్ పటేల్ చుట్టూ ఉన్నవారంతా మంచి వారు కాదన్నారు.

హార్దిక్ పటేల్ అంటే ఎవరికి తెలియదని కాంతిభాయి

హార్దిక్ పటేల్ అంటే ఎవరికి తెలియదని కాంతిభాయి

వజ్రాభరణాల మధ్యవర్తిగా ఉన్న బాబూభాయి హిరానీ వంటి వారు వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఉపాధి లేక అల్లాడిపోతున్నామని ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గట్టి ప్రతిపక్షంగా తీర్చిదిద్ధాలన్నదే తమ అభిమతం అని పేర్కొంటున్నారు. ఈ దఫా కుల సమీకరణాలు కూడా పని చేస్తాయని అంచనా వేస్తున్నారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ ధరించి మొనోగ్రామ్ సూట్ రూ.4.3 కోట్లకు వేలంలో కొనుక్కున్న ధర్మానంద్ డైమడ్ యజమాని లాల్జీ పటేల్ బావ మరిది కాంతిభాయి.. బలార్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వరచ్చా పట్టణంలో బలార్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో హార్దిక్ పటేల్ అంటే ఎవరికీ తెలియదని బలార్ అభ్యర్థి కాంతిభాయి తెలిపారు. తానే నిజమైన పటేల్‌నని వ్యాఖ్యానించారు.

పాటిదార్లలో ఆగ్రహం నిజమేనన్న బీజేపీ ఎమ్మెల్యే

పాటిదార్లలో ఆగ్రహం నిజమేనన్న బీజేపీ ఎమ్మెల్యే

సూరత్ నార్త్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేశ్ కఛాడియా (47) 2015లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘పాస్' ఆందోళన మద్దతుతో కార్పొరేటర్‌గా గెలిచారు. పాస్ ఇంటింటికి ప్రచారంపైనే ఆధార పడి ప్రచారం నిర్వహిస్తున్న దినేశ్ కఛాడియా ఈ దఫా బీజేపీ పట్ల ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. అమ్రేలీకి చెందిన పాటిదార్ దినేశ్ కఛారియా స్పందిస్తూ సూరత్ నార్త్ సెగ్మెంట్ పరిధిలో 1.54 మంది ఓటర్లు ఉంటే 45 వేల మంది పాటిదార్లే ఉన్నారని తెలిపారు. సౌరాష్ట్ర, మేహ్సానా, సెంట్రల్ గుజరాత్, సూరత్ సెగ్మెంట్ల పరిధిలో సుమారు 45 వేల మంది పాటిదార్లు ఉంటారని తెలిపారు. సూరత్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పాటిదార్ల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ 23 డివిజన్లలో గెలుపొందిందని చెప్పారు. వరచ్చా రోడ్ బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి కనానీ మాట్లాడుతూ పాటిదార్లలో ఆగ్రహం ఉన్నదని, బీజేపీకి వ్యతిరేకంగా మండిపడుతున్నారని అన్నారు. కానీ తాను చేపట్టిన అభివ్రుద్ది కార్యక్రమాలే గెలిపిస్తాయని చెప్పారు. గమ్మత్తేమిటంటే హార్దిక్ పటేల్ సారథ్యంలోని ‘పాటిదార్ల రిజర్వేషన్' ఆందోళనకు మద్దతుదారుగా ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Day after Tomarrow to go for voting in the Gujarat Assembly elections, the big question that’s hanging over this diamond hub in Surat city is this: will the BJP be able to tide over the resentment triggered by the note ban and GST?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి