నిబంధనల ఉల్లంఘన?: రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు

గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పీపుల్స్ రిప్రసెంటేటివ్ యాక్ట్ 126 నిబంధనను ఆయన ఉల్లంఘించారని ఫిర్యాదు అందిందని తెలిపింది.

 Gujarat elections: EC to examine complaint against Rahul Gandhi

1951 ఆర్పీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాహుల్ గాంధీ స్థానిక టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వాయిన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.

తాము రాహుల్ ఇంటర్వ్యూలకు సంబంధించిన డీవీడీలను సేకరించామని చెప్పారు. ఆర్పీ యాక్ట్ 126 నిబంధనలను ఉల్లంఘించి ఆయన ఏమైనా మాట్లాడారా? అనే విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+