ఒవైసీపై రాళ్ల దాడి - మోదీ రాష్ట్రంలో రక్షణ లేదా?..!!
అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి.
గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి.

కాగా- హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సైతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. మైనారిటీల ఓటుబ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపనుంది. సుమారు 25 నుంచి 30 నియోజవర్గాల్లో పోటీ చేయడానికి ఏఐఎంఐఎం చీఫ్ సమాయాత్తమౌతోన్నారు. కొన్ని స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు.

ఈ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా పాల్గొంటోన్నారు. ఇందులో భాగంగా ఆయన అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ప్రయాణిస్తోన్న బోగీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. అహ్మదాబాద్ నుంచి సూరత్ వైపు రైలు వెళ్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రాళ్ల దాడిలో అసదుద్దీన్ ఒవైసీ కూర్చున్న సీటు వైపు అద్దాలు పగిలిపోయాయి. అహ్మదాబాద్ నుంచి 20-25 కిలోమీటర్లు ప్రయాణంచిన తరువాత ఒక్కసారిగా తాము కూర్చున్న కిటికీ వైపు రాళ్లు విసిరారని ఏఐఎంఐఎం సీనియర్ నాయకుడు వరిస్ అహ్మద్ చెప్పారు. ఆ సమయంలో తాను ఒవైసీ పక్కనే కూర్చుని ఉన్నానని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా.. తాము భయపడబోమని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications