కలకలం: బాత్ రూంలోకొచ్చిన ఐదడుగుల మొసలి
ఆనంద్: నదుల్లో, పెద్ద పెద్ద సరస్సుల్లో కనిపించే మొసలి ఒక్కసారిగా తమ బాత్ రూంలో కనిపించడంతో ఆ కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలో చోటు చేసుకుంది.
సోజిత్ర పట్టణంలోని ఓ ఇంట్లోకి సుమారు ఐదడుగుల మొసలి ప్రవేశించింది. ఈ ఘటన జులై 21న చోటు చేసుకుంది. తమ ఇంట్లోని బాత్రూంలో ఐదడుగుల మొసలిని చూసిన తమ కుటుంబసభ్యులందరూ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైనట్లు ఆ ఇంటి యజమాని భరత్ పటేల్ తెలిపారు.

బాత్రూంలో ఆ మొసలి ఓ పక్కకు ఉండటంతో వెంటనే బాత్ రూం తలుపులు మూసి వేసినట్లు ఆయన చెప్పారు. తమ ఇంట్లో ఓ మొసలి ఉందని చుట్టు పక్కల వారందరికీ చెప్పాడు. ఆ మొసలి ఇంట్లోకి ఎలా వచ్చిందనేది వారికి కూడా తెలియకపోవడం గమనార్హం.
ఆ తర్వాత సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పటేల్ ఇంటికి చేరుకున్నారు. ఆ మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆనంద్ జిల్లాలోని మలతాజ్ గ్రామంలోని ఓ సరస్సులో ఆ మొసలిని వదిలిపెట్టారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications