Rahul Gandhi: రాహుల్ గాంధీ కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి..
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణ నుంచి గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బుధవారం తప్పుకున్నారు. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది పిఎస్ చంపనేరి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి గీతా గోపికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) వాదానలు వినిపిస్తూ ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదన్నారు.
ఇరు పక్షాల వాదన విన్న జస్టిస్ గోపి కేసును ప్రధాన న్యాయమూర్తికి అప్పగించాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ కేసు నుంచి తప్పుకున్నారు.పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించింది. సూరత్ కోర్టు తీర్పుపై మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ 2019 కర్టాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది. రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.
"సూరత్ కోర్టు ఇటీవలి తీర్పును సవాలు చేస్తూ మేము ఈ రోజు గుజరాత్ హైకోర్టులో దరఖాస్తు చేశాము" అని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పంకజ్ చంపనేరి తెలిపారు. సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చడంతో అతనిపై లోక్ సభ సెక్రటెరియట్ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రతినిధుల చట్టం, 1951 (RP చట్టం) ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఏదైనా నేరానికి శిక్ష విధించబడిన ఎన్నికైన ప్రజాప్రతినిధి తక్షణం అనర్హతను ఎదుర్కొంటారు.
ఏప్రిల్ 22న లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఎంపీగా తనకు కేటాయించిన 12 తుగ్లక్ లేన్ ఇంటిని రాహుల్ గాంధీ ఖాలీ చేశారు. మోడీ ఇంటిపేరు పరువునష్టం కేసులో బీహర్ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై పాట్నా హైకోర్టు మే 15 వరకు స్టే విధించింది. 'మోడీ ఇంటిపేరు'పై రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై 2019లో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 12న హాజరుకావాలని పాట్నా దిగువ కోర్టు కాంగ్రెస్ నాయకుడిని కోరింది.

పరువు నష్టం కేసులో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ గాంధీ ఏప్రిల్ 22 న పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. పరువు నష్టం కేసు ఇప్పటికే సూరత్ కోర్టులో విచారణలో ఉన్నప్పుడు, అదే విషయంలో వేరే కోర్టులో మరో విచారణ సరికాదని కోర్టు పేర్కొంది. ఇది చట్టవిరుద్ధంమని పేర్కొంది. తదుపరి విచారణను మే 15కి వాయిదా వేయడంతో పాటు అప్పటి వరకు దిగువ కోర్టు విచారణలన్నీ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications