హార్దిక్ వార్డులో బిజెపి,మోడీ ఇలాకాలో కాంగ్రెస్ గెలుపు
గాంధీనగర్: ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఊరటను ఇచ్చేలా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి దూసుకెళ్తోంది. పటేళ్ల ఆందోళనకారుడు హార్దిక్ పటేల్ ఉన్న వార్డును కూడా బిజెపి గెలుచుకుంది.
అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, జామ్ నగర్, భావ్ నగర్... మొత్తం ఆరు మునిసిపల్ కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలి ఫలితాలు విడుదలయ్యేసరికి అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది.

వడోదరలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సవాల్ విసిరిన, రాష్ట్రంలోని బీజేపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టించిన యువ సంచలనం హార్దిక్ పటేల్‌కు షాక్ తగిలింది.
ఆయన సొంత వార్డులో బిజెపి పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అహ్మదాబాదులో మేయర్ మీనాక్షిబెన్ విజయం సాధించారు. జునాగర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఓడిపోయారు. రాజ్‌కోట్ బిజెపి అధ్యక్షులు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్‌లలో ప్రభావం చూపుతోంది.
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ప్రధాని మోడీకి కూడా షాక్ తగిలింది. ఆయన సొంత జిల్లా జెడ్పీ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతేకాదు, ప్రధాని మోడీ మున్సిపల్ కార్పోరేషన్ అయిన మెహన్సాను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.












Click it and Unblock the Notifications