వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్పంచ్ భార్యను చెరబట్టిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి: నిర్బంధించి..రేప్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా పలుమార్లు గుజరాత్‌లో పర్యటించారు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరి కొన్నింటిని ప్రారంభించారు. ఎన్నికల సమీపిస్తోండటంతో అటు బీజేపీలోనూ చేరికలు మొదలయ్యాయి.

Liger: తొక్కిసలాట: ఊపిరాడక సొమ్మసిల్లి: మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండLiger: తొక్కిసలాట: ఊపిరాడక సొమ్మసిల్లి: మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ

మంత్రిపై అత్యాచార ఆరోపణలు..

మంత్రిపై అత్యాచార ఆరోపణలు..

ఈ పరిణామాల మధ్య గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అర్జున్‌సింహ్ చౌహాన్‌పై అత్యాచార ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్పంచ్ భార్యను ఆయన అత్యాచారం చేశాడంటూ వార్తలొచ్చాయి. ఆయనపై పోలీస్ స్టేషన్‌లో సర్పంచ్ ఫిర్యాదు చేశారు. మంత్రిపై కేసు నమోదైంది. దీనితో బీజేపీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై నిప్పులు చెరుగుతోంది. మంత్రి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలకు దిగింది.

సొంత నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ భార్యపై..

సొంత నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ భార్యపై..

ఖేడా జిల్లాలోని మెహ్మదావాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. మెహ్మదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి అర్జున్‌సింహ్ చౌహాన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో గల హల్దర్‌వాస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భార్యను ఆయన చెరబట్టారు. నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. తొలుత తన భార్యతో మంత్రి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, దాన్ని నిలదీసినందుకు తన భార్యపై కక్ష సాధించాడని సర్పంచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు

 నిర్ధారించిన జిల్లా పోలీసులు..

నిర్ధారించిన జిల్లా పోలీసులు..

కాగా- మంత్రిపై కేసు నమోదైన విషయాన్ని ఖేడా జిల్లా ఎస్ఎస్పీ నిర్ధారించారు. దర్యాప్తు సాగుతోందని చెప్పారు. హల్దర్‌వాస్ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై తాము ప్రాథమిక దర్యాప్తు చేశామని, అందులో ఉన్న విషయాలన్నీ నిజమేనని తేలిందని స్పష్టం చేశారు. మంత్రిపై కేసు నమోదు చేశామని ధృవీకరించారు. క్రిమినల్ ప్రొసీజర్స్ కింద తదుపరి దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు.

కాంగ్రెస్ ఆందోళనలు..

కాంగ్రెస్ ఆందోళనలు..

మంత్రిపై అత్యాచార కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మంత్రిని బర్తరఫ్ చేయాలంటూ నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. ఖేడా జిల్లాలో పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోన్నారని, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలకు దిగారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ స్పందించాలని డిమాండ్ చేస్తోన్నారు. అర్జున్‌సింహ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పట్టుబట్టారు.

English summary
Gujarat's Rural Development Minister Arjunsinh Chauhan has been accused of rape and illegal confinement of a woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X