బాలికపై టీచర్ రేప్ : మార్కులు కావాలంటే ఆ పని చేయాలన్నాడు

మహన్సా : టీచర్ ఇచ్చే గైడెన్స్ ఆధారంగానే.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు విద్యార్థులు. అయితే ఆ గైడెన్స్ చదువును తప్పుదోవ పట్టించేదైతే!.. గుజరాత్ లో ఓ టీచర్ ఇలాగే వ్యవహరించాడు. మార్కులు బాగా రావాలంటే.. తనతో చనువుగా మెలగాలని విద్యార్థిని ప్రలోభ పెట్టాడు.

దీంతో చనువుగా ఉండడం మొదలుపెట్టింది సదరు విద్యార్థిని. ఇదే అదునుగా భావించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు టీచర్. గుజరాత్‌లోని మెహన్సా జిల్లా పరిధిలోని విసానగర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇదంతా జరిగిన ఏడాది తర్వాత ఘటన వెలుగుచూడడం గమనార్హం.

విసానగర్‌ లో ఉండే రాజేష్ పటేల్ అనే ఉపాధ్యాయుడు ఇంటి వద్దనే విద్యార్థులకు ట్యూషన్లు చెబుతుండేవాడు. స్థానికంగా ఉండే చాలామంది విద్యార్థులు అతని వద్ద ట్యూషన్ లో చేరారు. ఇదే క్రమంలో పదో తరగతి చదువుతున్న ఓ దళిత బాలిక (16) కూడా అతని వద్ద ట్యాషన్ లో చేరింది.

Gujarat: Teacher 'rapes minor Dalit student after assuring her good grades'

ఈ క్రమంలోనే ఆ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్న రాజేష్.. బాలికతో మరింత సాన్నిహిత్యం ఏర్పరుచుకున్నాడు. మార్కులు బాగా రావాలంటే తనతో చనువుగా ఉండాలని, అలా అయితే వార్షిక పరీక్షల్లో తానే పాస్ చేయిస్తానని మాయ మాటలు చెప్పాడు. మాయ మాటలు నమ్మిన బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు.

ప్రస్తుతం పదకొండో తరగతి చదువుతున్న బాలిక రాజేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. మార్కులు వేయిస్తానని ప్రలోభ పెట్టి తనను లోబర్చుకున్నాడని.. అలా.. 10-12 సార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డడాని ఫిర్యాదులో పేర్కొంది బాధిత బాలిక. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ప్రస్తుతం రాజేష్ ను పట్టుకునే పనిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+