Gujarat: చరిత్ర సృష్టించిన క్రిష్టియన్ బీజేపీ అభ్యర్థి, భారీ మెజారిటీతో ఎమ్మెల్యే, మోదీ లెక్క, పక్కా, ఓకే !
అహమ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర తిరగరాసిన విషయం తెలిసిందే. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. అమ్ ఆద్మీ పార్టీ నాయుల వలన పరోక్షంగా బీజేపీకి మేలు జరిగింది. అయితే 20 ఏళ్ల తరువాత గుజరాత్ లో క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి చరిత్ర సృష్టించాడు.
గుజరాత్ లో 20 ఏళ్ల తరువాత క్రిష్టియన్ అభ్యర్థి బీజేపీ టిక్కెట్ అడగడం, కాదనకుండా నాయకులు టిక్కెట్ ఇచ్చేడం. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. గుజరాత్ లోని తాపి జిల్లాలోని వ్యారా నియోజక వర్గం (ట్రైబల్ సీట్ )నుంచి మోహన్ కోంకణి అనే క్రిష్టియన్ అనే వ్యక్తి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేశారు.

ఇదే నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన పునభాయ్ గమిత్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేశారు. అమ్ ఆధ్మీ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే క్రిష్టియన్ బీజేపీ అభ్యర్థి మోహన్ కోంకణి 22, 670 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర తిరగరాశారు.
వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన పునభాయ్ గమిత్ మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. వ్యారా నియోజవ వర్గంలో 40 వేలకు పైగా క్రిష్టియన్ ఓట్లు ఉన్నాయి. మోహన్ కోంకణి మీద బీజేపీ నాయకులు పెట్టుకున్న నమ్మకానికి అక్కడి క్రైస్తవ సోదరులు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో మోహన్ కోంకణి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. 20 ఏళ్ల తరువాత గుజరాత్ లో బీజేపీ టిక్కెట్ మీద ఓ క్రిష్టియన్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారే మోహన్ కోంకణి జాక్ పాట్ కొట్టేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications