గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
గుజరాత్ అసెంబ్లీ సమావేశానికి టీ షర్ట్ వేసుకుని వచ్చిన ఎమ్మెల్యే విమల్ చూడాసమాను స్పీకర్ రాజేంద్ర త్రివేది సోమవారంనాడు సభ నుంచి బయటకు పంపించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే టీ షర్టు వేసుకోరాదని ఎక్కడా నియమం లేదని ఎమ్మెల్యే వాదించగా, డ్రెస్ కోడ్‌పై నిబంధనలున్నాయని స్పీకర్ పేర్కొన్నారు.
సోమనాథ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమా ఇటీవల తరచూ టీ షర్టు వేసుకుని అసెంబ్లీకి సమావేశాలకు వస్తున్నారు. ఇలా టీ షర్టు వేసుకుని సభకు రావడం సభా మర్యాదకు విరుద్ధంగా ఉందని, షర్ట్ లేదా కుర్తా వేసుకుని రావాలని స్పీకర్ రాజేంద్ర త్రివేది వారం రోజుల కిందట విమల్ చూడాసమాకు సూచించారని ఎన్డీటీవీ తెలిపింది.
- ప్రభుత్వ బ్యాంకులను మోదీ ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరిస్తోంది? ఉద్యోగుల సమ్మె ఎందుకు?
- బ్యాంకుల సమ్మె: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరిస్తుందా?
సభలో ఏం జరిగింది?
"జెర్సీలు, టీషర్టులు వేసుకుని సభకు రావద్దని ఒక నియమం ఉంది. ఒక ఎమ్మెల్యే సభా నియమాలకు విరుద్ధంగా మళ్లీ జెర్సీ వేసుకుని వచ్చారు. రెండు నిమిషాల కిందటే ఆ ఎమ్మెల్యే సభ నుంచి బైటికి వెళ్లారు. బయట మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటామో అనవసరం. కానీ సభలో ఉన్నప్పుడు సహా నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదు. ఇవాళ టీ షర్టు వేసుకుని వచ్చారు. రేపు ఏ బనియనో వేసుకుని వస్తారు. ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను" అని అప్పుడే సభ నుంచి బయటకు వెళ్లిన చూడాసమా తీరుపై స్పీకర్ సోమవారం నాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించినట్లు 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' పేర్కొంది.
కాసేపటి తర్వాత చూడాసమా సభలోకి వస్తుండగా ''మీరు షర్ట్, కుర్తా, కోట్ వేసుకుని రండి’’ అని స్పీకర్ సూచించారు. అయితే ఎమ్మెల్యే విమల్ చూడాసమా స్పీకర్‌తో వాదనకు దిగి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నియమాలు ఏమీ లేవని అన్నారు.
ఎమ్మెల్యేల డ్రెస్ కోడ్‌పై స్పష్టమైన నిబంధనలున్నాయని స్పీకర్ త్రివేది ఆయనకు చెప్పారు. "మీరు మీ దుస్తులు మార్చుకుని వచ్చే వరకు మీరు చెప్పేది ఏదీ నేను వినను'' అని స్పీకర్ స్పష్టం చేసినట్లు 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది.
- నరేంద్ర మోదీ, గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు... 2006లో కశ్మీర్లో ఏం జరిగింది?
- కశ్మీర్: ఆర్టికల్ 370 రూపొందించిన గోపాలస్వామి అయ్యంగార్ ఎవరు?
చూడాసమా వాదనేంటి?
ఎన్నికల్లో సోమనాథ్ నియోజకవర్గ ప్రజల వద్దకు టీ షర్టులోనే వెళ్లానని, సభకు కూడా ఇలాగే వస్తానని చూడాసమా వ్యాఖ్యానించగా, "మీరు ప్రజలకు దగ్గరకు ఎలా వెళ్లారో నాకు అనవసరం. కానీ మీరు స్పీకర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. మీకు ఇష్టమొచ్చిన దుస్తులు వేసుకుని రావడానికి ఇది ఆటస్థలం కాదు, మీరు విహారయాత్రలో లేరు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అసెంబ్లీలో డ్రెస్‌కోడ్‌పై నిబంధనలు ఉన్నాయి" అన్న స్పీకర్ త్రివేది, విమల్ చూడాసమాను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆయన్ను సభ వెలుపలికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడాసమాకు మద్దతుగా నినాదాలు చేయగా, ఇందులో అవమానంగా భావించాల్సింది ఏమీ లేదని, సభా మర్యాదలు పాటించడం వల్ల అందరి గౌరవం పెరుగుతుందని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్ రూపాని అన్నారు.
"ఈ మధ్య మా మంత్రి కూడా ఇలాగే టీ షర్టు ధరించి వస్తే స్పీకర్ తప్పుబట్టారు. ఆయన ఇంటికి వెళ్లి వేరే దుస్తులు ధరించి వచ్చారు. ఈ విషయాన్ని సాగదీయకుండా ఇంతటితో వదిలేద్దాం" అని ముఖ్యమంత్రి రూపాని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్‌గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్‌ట్యాగులు
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణాలేంటి... ఏ పార్టీ ఏమంటోంది?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)