గుజరాతీలు అబద్ధాలకోర్లు: ములాయం వివాదాస్పదం

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ గుజరాతీలందరూ అబద్ధాలకోర్లు అనే వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని మోడీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ గుజరాతీ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అన్నారు. హామీలను అమలు చేయనివాళ్లందరూ తన దృష్టిలో ఉన్నారని అన్నారు.

ములాయం సింగ్ యాదవ్ లక్నోలో జరిగిన పార్టీ జాతీయ మహిళా సదస్సులో ఆ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రాజకీయాల్లో తమ పాత్రపై పార్టీ మహిళా నాయకులు సదస్సులో చర్చించారు. ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ కూడా సదస్సులో ఉన్నారు

Gujaratis are liars: SP chief Mulayam Singh Yadav

మహిళను సాధికారం చేస్తానని మోడీ తప్పుడు హామీ ఇస్తున్నారని ములాయం విమర్శించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న మోడీ భార్య ఎక్కుడుందో ఎవరైనా అడగాలని ఆయన అన్నారు. మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ఆయన ధ్వజమెత్తారు. మహిళల కోసం తాము చాలా చేశామని కొంత మంది అబద్ధాలు చెబుతారని, అటువంటివారు తెలివిగా ఓట్లను రాబట్టుకుని ప్రధాని అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. వారిని నమ్మవద్దని ఆయన అన్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఉచితంగా పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌లో లోకసభ ఎన్నికల్లో తమ కొంప ముంచాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అన్న విషయం తెలిసిందే. గత లోకసభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ఆ ల్యాప్‌టాప్‌లే కారణమని ఆయన అన్నారు.

యువకులుంతా తాము పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌ల ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగాలు చూసి ప్రభావితులయ్యారని ఆయన అన్నారు. పార్టీ జాతీయ స్థాయి మహిళా విభాగం సమావేశంలో ఆయన ప్రసంగించారు. 12వ తరగతి పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించానని ఆయన చెప్పారు. ఆ ల్యాప్‌టాప్‌ల ద్వారా మోడీ ప్రసంగాలు విని ప్రజలు ఆకర్షతులైనట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+