గుర్గావ్ డిప్యూటీ మేయర్‌పై రేప్ కేసు

న్యూఢిల్లీ: గుర్గావ్ డిప్యూటీ మేయర్, బిజెపి నాయకుడు పర్మీందర్ కటారియాపై అత్యాచారం కేసు నమోదైంది. ఆర్థికంగా, మానసికంగా బలహీనంగా ఉన్న మహిళను బెదిరించి, లొంగదీసుకుని చివరకు ముఖం చాటేశాడని పర్మీందర్ కటారియాపై కేసు నమోదైంది.

తనకు ఉద్యోగం ఆశ చూపించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించడానికి ఆరోపిస్తూ ఆ మహిళ కటారియపై ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఆశోక్ విహార్‌లో నివసిస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో పని మీద వెళ్లిన ఆమెను కటారియా లక్ష్యం చేసుకున్నాడు. ఉద్యోగం ఆశ చూపి, ప్రేమ నటించి ఆమెను లోబరుచుకున్నాడు.

Gurgaon Deputy Mayor Parminder Kataria booked on rape charge

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆరు నెలల పాటు సహజీవనం చేశాడు. పెళ్లి ఊసు లేకపోవడంతో కటారియాను ఆమె నిలదీసింది. దీంతో అతను, అతని స్నేహితులు బెదిరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న కటారియా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అని ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. తాను డిప్యూటీ మేయర్‌గా ఉన్న గుర్గావ్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని బాధితురాలిని వశపరుచుకుని, నమ్మించినట్లుగా తెలుస్తోందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+