'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి, ఆస్ట్రేలియా నుంచి ఔషధాలు

Subscribe to Oneindia Telugu
  Gurmeet Ram Rahim is a $ex addict 'సెక్స్' లేక జైల్లో ఇలా!: డేరా బాబాకు అదంటే విపరీతమైన పిచ్చి

  ఛండీగఢ్‌: భక్తి, ఆధ్యాత్మిక ముసుగులో డేరా బాబా సాగించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. పైకి బాబాలా పోజు కొడుతూనే.. లెక్కకు మించి నేరాలు చేశాడు. స్త్రీ లోలుడిగా ఎంతోమంది శిష్యురాళ్లను చెరబట్టాడు. ఒకవిధంగా మదమెక్కిన కామపిశాచి అన్న పదానికి డేరా బాబా పక్కా సూట్ అవుతాడు.

  తవ్వుతున్న కొద్దీ డేరా బాబా చీకటి కోణాలు: రాసలీలల కోసం సొరంగం

  ఏకంగా తన బెడ్‌రూమ్ నుంచి సాద్వీల నివాసాల్లోకి సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్న డేరా బాబా.. రాత్రి కాగానే శృంగార పురుషుడి అవతారం ఎత్తుతాడు. నచ్చిన శిష్యురాలితో రాత్రంతా తన కామ కార్యాకలాపాలు కొనసాగిస్తాడు. ఉదయం యథావిధిగా మళ్లీ బాబా అవతారంలో భక్తులకు దర్శనమిస్తాడు. డేరా బాబా కామకేళి గురించి ఇప్పుడు మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూశాయి.

  'సెక్స్' వ్యసనం, జైల్లో ఇలా!:

  'సెక్స్' వ్యసనం, జైల్లో ఇలా!:

  డేరా బాబా 'సెక్స్'కు వ్యసనంగా మారాడని వైద్యులు చెబుతున్నారు. జైల్లో ఆయన మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారట. జైల్లోకి వెళ్లినప్పటి నుంచి శృంగారానికి దూరంగా ఉండాల్సి రావడంతో బాబా ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఎప్పుడూ నిర్లిప్తంగా ఉండటం, , గోడలతో మాట్లాడుతుండటం, సరిగా భోజనం చేయకపోవడం.. ఇవన్నీ దాని ఎఫెక్టే అని అంటున్నారు.

  ఒక్కసారిగా దూరమయ్యేసరికి:

  ఒక్కసారిగా దూరమయ్యేసరికి:

  ఏళ్లుగా కొనసాగిస్తున్న తన రాసలీలలకు ఒక్కసారిగా బ్రేక్ పడేసరికి డేరా బాబా.. మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారిగా దానికి దూరం కావాల్సి రావడంతోనే జైల్లో ఆయనెప్పుడూ మూడీగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆయనకు త్వరగా చికిత్స అందించకపోతే సమస్య మరింత పెరుగుతుందని సదరు వైద్యులు వెల్లడించడం గమనార్హం.

  ఆస్ట్రేలియా నుంచి సెక్స్ ఔషధాలు:

  ఆస్ట్రేలియా నుంచి సెక్స్ ఔషధాలు:

  డేరా బాబా ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా సెక్స్‌ ఔషధాలను తెప్పించుకునేవాడని తెలుస్తోంది. ఒకప్పుడు మద్యానికి బానిసైన డేరా బాబా.. చాలా ఏళ్ల క్రితమే ఆ వ్యసనం నుంచి బయటపడ్డారట. అయితే ఎనర్జీ డ్రింక్స్ మాత్రం ప్రతీ రోజు తప్పనిసరిగా తీసుకునేవారట. అలాగే 1988వరకు మాంసాహారాన్ని తీసుకున్న ఆయన.. ఆ తర్వాత నుంచి మానేశారట. అప్పటినుంచే కేవలం శాఖాహారం మాత్రమే తింటున్నారట.

  ముగిసిన సోదాలు:

  ముగిసిన సోదాలు:

  ఆదివారం నాటితో డేరా సచ్చా సౌదాలో సోదాలు ముగిశాయని హరియాణా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ మెహ్రా తెలిపారు. ఈ నెల 8నుంచి డేరా ఆశ్రమంలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  కాగా, డేరా బాబా దత్త పుత్రిక హానీ ప్రీత్ సింగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. బాబా అరెస్టయి తర్వాత ఆమె ఎక్కడున్నది ఇంతవరకు తెలియరాలేదు. ఇప్పటికే ఆమెకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. నేపాల్-భారత్ సరిహద్దు వెంబడి ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఆమె ఫోటోను అతికిస్తున్నారు.
  నేపాల్ లో ఆమె తలదాచుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ఆమె ఫోటోలను అతికిస్తున్నారు.

  దొంగ బాబాల జాబితా:

  దొంగ బాబాల జాబితా:

  స్వప్రకటిత బాబాలుగా చలామణి అవుతూ దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న 14మంది బాబాల పేర్లతో అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ ఒక జాబితా తయారుచేసింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

  జాబితాలో పేర్లు:

  ఆసారాం బాపూ, రాధేమా, సచ్చిదానంద్‌ గిరి ఎలియాస్‌ సచిన్‌ దత్తా, గుర్మీత్‌ రాంరహీం సింగ్‌, ఇచ్చాధారి భీమానంద్‌, మల్ఖన్‌ సింగ్‌, నారాయణ్‌ సాయి, రాంపాల్‌, ఆచార్య ఖుష్‌మురి, స్వామి అసీమానంద్‌, బృహస్పతి గిరి, ఓం నమః శివాయ బాబా, నిర్మల్‌ బాబా, ఓం బాబా.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jailed self-styled godman Gurmeet Ram Rahim is not feeling well. Besides diabetes, the incarcerated Dera Sacha Sauda chief has also reported feeling uneasy and restless to a team of doctors who examined him at a Rohtak jail on Saturday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X