Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CEC Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

CEC Gyanesh Kumar: 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ ను దేశ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా.. హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్ గా నియమించినట్లు సోమవారం రాత్రి ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీఈసీగా జ్ఞానేష్ కుమార్ పదవీ కాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది. అంతకు ముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేశారు.

జ్ఞానేష్ కుమార్ 4 సంవత్సరాల పదవీ కాలంలో 20 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం(పుదుచ్చేరి)లో ఎన్నికలు జరుగుతాయి. ఆయన పదవీ కాలంలో ఎన్నికలు బీహార్ నుంచి ప్రారంభం కానుండగా.. చివరి ఎన్నికలు మిజోరాంలో జరుగుతాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొత్తగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమేనని అన్నారు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలన్నారు. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలన్నారు. భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, నియమాలు, దాని జారీ చేయబడిన సూచనల ప్రకారం.. భారత ఎన్నికల సంఘం ఓటర్లతో ఉందని.. ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

Gyanesh Kumar Takes Charge as 26th Chief Election Commissioner of India

భారత 26వ సీఈసీగా ఉన్న కాలంలో జ్ఞానేష్ కుమార్ ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, 2026లో కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అదే విధంగా 2026లో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినందుకు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు అభినందనలు తెలిపారు.

జ్ఞానేష్ కుమార్ ఎవరు?
1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ జనవరి 27, 1964న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించారు. ఆయన ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ICFAI నుండి బిజినెస్ ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందాడు. ఆయన ఎర్నాకుళం అసిస్టెంట్ కలెక్టర్‌గా, అడూర్ డిప్యూటీ కలెక్టర్‌గా, కేరళ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కేరళలోని కొచ్చిన్ మునిసిపల్ కార్పొరేషన్ మునిసిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన అనేక ఇతర పదవులలో కూడా పనిచేశారు.

కేరళ ప్రభుత్వ కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్ ఆర్థిక వనరులు, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్టులు, ప్రజా పనుల శాఖ వంటి వివిధ విభాగాలను నిర్వహించారు. భారత ప్రభుత్వంలో ఆయనకు రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, హోంమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ,అదనపు కార్యదర్శిగా.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన జనవరి 31,2024న భారత ప్రభుత్వ సహకార కార్యదర్శిగా పదవి విరమణ చేసి.. మార్చి 14, 2024న భారత ఎన్నికల కమిషన్ లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.

రామమందిర నిర్మాణ కమిటీలో సభ్యుడిగా..
కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో తన పదవీ కాలంలో జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్ణయాలను అమలు చేయడంలో జ్ఞానేష్ కుమార్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ కమిటీ మాజీ ఐఏఎస్ నృపేంద్ర మిశ్రా ఛైర్మన్ గా వ్యవహరించారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం శ్రీరామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ లో తన ప్రతినిధిగా నియమించింది.రామాలయంలో ప్రతిష్టించబడే శ్రీరాముని బాల రూప విగ్రహాన్ని ఎంపిక చేసే జ్యూరీలో కూడా ఆయన ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+