కాశీ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ‘శివలింగం’: సీల్ చేయాలంటూ కోర్టు కీలక ఆదేశాలు
వారణాసి: జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం వద్ద చివరి రోజు సర్వే సందర్భంగా 'శివలింగం' కనిపించిందని, ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు సోమవారం జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.

శివలింగం ఉన్న ప్రాంతానికి సీల్ వేయండి: కోర్టు
"సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమీషనర్, పోలీస్ కమిషనరేట్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ వారణాసి బాధ్యత వహిస్తారు" అని ఆదేశించింది. ఈ కేసులో హిందూ పిటిషనర్ అయిన సోహన్ లాల్ ఆర్య, సర్వే కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం కనిపించింది: లాల్ ఆర్య
మసీదు సర్వే కోసం కోర్టు కమీషన్‌తో పాటు వచ్చిన ఆర్య, తమకు "నిశ్చయాత్మకమైన ఆధారాలు" దొరికాయని చెప్పారు లాల్ ఆర్య. "శివలింగం కనిపించిందని... ఎవరి కోసమైతే నంది ఇప్పటి వరకు ఎదురుచూస్తున్నాడో ఆయన దర్శనమిచ్చాడని తెలిపారు. విషయాలు స్పష్టంగా తెలియగానే మసీదు ప్రాంగణంలో 'హర్ హర్ మహావ్ దేవ్' కీర్తనలు ప్రతిధ్వనించాయి," అని ఆయన వెల్లడించారు.

శివలింగం ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయొద్దు: కోర్టు
శివుడి లింగం గుర్తించిన ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా చూసుకోవాలని వారణాసి కోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్పష్టం చేసింది. డీఎం, పోలీస్ కమిషనర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) కమాండెంట్ వారణాసి.. సీల్ చేసిన ప్రాంత భద్రతకు బాధ్యత వహించాలన్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

‘శివలింగం’ దర్శనంపై యూపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?
బుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానవాపిలో బాబా మహదేవ్ (శివలింగం) ఉన్నట్లు తేలడం సనాతన హిందువులకు శుభసూచకమని, పురాణ సందేశాన్నిచ్చిందని యూపీ డిప్యూటీ కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఈ మసీదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాల ముందు రోజువారీ ప్రార్థనలకు అనుమతి కోరుతూ మహిళల బృందం చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు విచారిస్తోంది. శివాలయాన్ని అప్పటి ముస్లిం రాజు ఆక్రమించి జ్ఞానవాపి మసీదు నిర్మించారని పలు హిందూ సంఘాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications