వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమే.. భారత్ లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకయ్యాయి : ఒప్పుకున్న హిటాచి

ఆన్ లైన్ భద్రతను సవాలు చేస్తూ గతేడాది అక్టోబర్ లో వెలుగులోకి వచ్చిన అతి పెద్ద సైబర్ అటాక్ పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. భారత్ లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకైనట్లు అంగీకరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆన్ లైన్ భద్రతను సవాలు చేస్తూ గతేడాది అక్టోబర్ లో వెలుగులోకి వచ్చిన అతి పెద్ద సైబర్ అటాక్ పై హిటాచి పేమెంట్ సర్వీసెస్ స్పందించింది. భారత్ లో 32 లక్షల డెబిట్ కార్డులు హ్యాకైనట్లు అంగీకరించింది.

యస్ బ్యాంకుకు సేవలందిస్తున్న హిటాచి పేమెంట్ సర్వీసెస్ సంస్థ కంప్యూటర్లలోకి మాల్ వేర్ (దొంగ సాఫ్ట్ వేర్) ను పంపి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది.

ఈ ఏటీఎం నెట్ వర్క్ అన్ని బ్యాంకులతో అనుసంధానమై ఉండటం వల్ల వివిధ బ్యాంకుల ఖాతాదారుల సమాచారం చైనా దొంగల చేతుల్లోకి వెళ్లపోయింది. ఈ వ్యవహారం మే, జూన్ నెలల్లో జరిగినప్పటికీ.. తమ ఖాతాల్లోని సొమ్ము పోయిందంటూ ఖాతాదారులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఫిర్యాదులు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hacking of 3.2 Million Debit Cards is Real : Hitachi Payment Corporation

600 మందికిపైగా ఖాతాదారులు ఈ హ్యాకింగ్ వల్ల నష్టపోయారని, వారి లావాదేవీల విలువ రూ.1.3 కోట్లు ఉంటుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ హ్యాకింగ్ నిజమేనని హిటాచి పేమెంట్ సర్వీసెస్ గురువారం మీడియా ఎదుట ఒప్పుకుంది. తమ భద్రతా చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కూడా పేర్కొంది.

''మిడ్ 2016లో మా సెక్యూరిటీ సిస్టమ్స్ హ్యాకింగ్ కు గురైనట్లు ఒప్పుకుంటున్నాం. హ్యాకర్లను త్వరలోనే కనిపెడతాం. కనుగొన్న వెంటనే ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలకు వివరిస్తాం. మా ఖాతాదారుల సెన్సిటివ్ డేటాను భద్రంగా ఉంచేందుకు బ్యాంక్స్, డెబిట్ కార్డు స్కీమ్స్ ను తీసుకొస్తున్నాం..'' అని హిటాచి పేమెంట్స్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు.

English summary
Hitachi Payments Corporation here on Thursday in a press meet agreed that in Mid 2016.. 3.2 million Debit Cards of various banks were hacked by hackers. The Managing Director of Hitachi said that they are going to introduce a new security scheme which will keep the data safe in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X