1947లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యుంటే.. కర్తార్పూర్ సాహిబ్ మనదేశంలోనే ఉండేది: అమిత్ షా
చండీగఢ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటే, కర్తార్‌పూర్ సాహిబ్, నంకనా సాహిబ్‌లు ఈ దేశంలో భాగమై ఉండేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం ఈ రెండు పాకిస్థాన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
కర్తార్‌పూర్ సాహిబ్ గురునానక్ దేవ్ అంతిమ విశ్రాంతి స్థలం అయితే, సిక్కుమతం వ్యవస్థాపనకు జన్మ స్థలం నంకనా సాహిబ్. ఈ రెండు ప్రదేశాలు ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఫిరోజ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తెరవాలన్న సిక్కుల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది మోడీయేనని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి ఉంటే.. కర్తార్‌పూర్ సాహిబ్, నన్‌కానా సాహిబ్‌లు భారతదేశంలో భాగమై ఉండేవని, మనదేశ సిక్కు ప్రజలు పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఉండేవారని ఆయన అన్నారు.
4-కిమీ పొడవున్న కర్తార్‌పూర్ కారిడార్ గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించడానికి భారతీయ సిక్కు యాత్రికులకు వీసా-రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. ఇది కూడా 2019లో ప్రారంభించబడింది. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం పఠాన్‌కోట్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, విభజన సమయంలో కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారతదేశంలోనే ఉంచడంలో విఫలమై కాంగ్రెస్ "పాపం" చేసిందని అన్నారు. 1965, 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల సమయంలో కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత భూభాగంలోకి తీసుకొచ్చే అవకాశం మళ్లీ కోల్పోయింది.
ఫిరోజ్‌పూర్ ర్యాలీలో, పంజాబ్‌కు బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే భద్రత కల్పిస్తుందని షా పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలు అలా చేయగలవా? అని ప్రశ్నించారు.
'నరేంద్ర మోడీ (బీజేపీ కూటమి)కి ఐదేళ్లు అధికారం ఇవ్వాలని.. మీ కుటుంబానికి చెందిన యువత డ్రగ్స్ కూడా ముట్టుకోలేరని, పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని పంజాబ్ తల్లులకు హామీ ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు.
Recommended Video
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టడంలో విఫలమైందని అమిత్ షా అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో యువతను మద్యానికి బానిసలను చేసేలా గల్లీ గల్లీలోనూ మద్యం షాపులను తెరిచిందని మండిపడ్డారు. పంజాబ్ కు డ్రగ్స్ నుంచి విముక్తి కలగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications