పహల్గాం నరహంతకుడు హఫీజ్ సయీద్ కు ఫుల్ సెక్యూరిటీ.. 24 గంటలూ ఇంటికి రక్షణ వలయంగా పాక్ సైన్యం..!

పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బ పగ తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. ఇరుదేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. భారత్- పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్ పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మరోసారి బరితెగించినట్లు తెలుస్తోంది.

పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి, ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ అందిస్తున్నట్లు సమాచారం. అతడి ఇంటికి అన్ని వైపులా పాకిస్థాన్ సైన్యంతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ లోని రద్దీగా ఉండే లాహోర్ నగరంలో హఫీజ్ సయీద్ ఉల్లాసంగా ఎలాంటి బెరుకూ లేకుండా జీవిస్తున్నట్లు సమాచారం.

హఫీజ్ సయీద్ ప్రస్తుతం లాహోర్‌లోని జోరమ్‌ తౌమ్‌ అనే అత్యంత రద్దీ కలిగిన ప్రాంతంలో తన విలాసమైన భవనంలో నివసిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. హఫీజ్‌ నివాసం వద్ద పాక్‌ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం.

హఫీజ్‌ తన కుటుంబంతో కలిసి ఈ భవనంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ భవంతిలో ఓ ప్రైవేటు పార్క్‌, మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు సమాచారం. భవనం కింద ఓ బంకర్‌ కూడా ఉందని ఓ ప్రముఖ వార్త పత్రిక అందించిన కథనం ద్వారా తెలుస్తోంది. ఎవరైనా దాడికి పాల్పడితే ఆ బంకర్ లోకి వెళ్లి దాక్కునేందుకు ఇది ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Hafiz Saeed Enjoys 24 7 Protection from Pakistani Army Despite Terror Links

అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం హఫీజ్ సయీద్ వివిధ కేసుల్లో భాగంగా జైల్లోనే ఉన్నాడని అబద్ధాలు చెప్తోంది. హఫీజ్ కు 31 ఏళ్లు జైలు శిక్ష పడిందని ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు పేర్కొంటూ వస్తోంది. ఇక 26/11 ముంబై ఉగ్రదాడులతో పాటు అనేక ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడిగా హఫీజ్ సయీద్‌ ఉన్నాడు. సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గతంలోనే ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+