వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చారిత్రాత్మ‌క‌ తీర్పు: హజీ అలీ దర్గాలోకి మహిళలకు అనుమతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలోని ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ బాంబై హైకోర్టు శుక్రవారం చారిత్రాత్మ‌క‌ తీర్పునిచ్చింది. దర్గాలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించడం వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లేనని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.

పురుషులతో సమానంగా మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే... ఎంతో చరిత్ర కలిగిన ఈ దర్గాలోకి మహిళలు రాకూడదంటూ హజీ అలీ దర్గా ట్రస్ట్‌ 2012లో నిషేధం విధించింది.

 Haji Ali dargah will have to open doors for women after Bombay High Court ruling

అప్పట్లో దీనిపై పిల్ దాఖలైంది. లింగ‌భేదాన్ని ఖండిస్తూ భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఇటీవ‌లే దేశంలో మ‌హిళ‌ల‌కు అనుమ‌తిలేని ప‌లు ఆల‌యాల్లోకి ప్ర‌వేశించి పూజ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆమె చేస్తోన్న‌ ఉద్యమ ఫ‌లితంగా శనిసింగనాపూర్‌, త్రయంబకేశ్వర్‌ ఆలయాల్లోకి మ‌హిళ‌లు ప్రవేశించారు.

దర్గాలోనికి కూడా మహిళలను అనుతించాలంటూ ఆమె ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో దర్గాలోకి మహిళలపై ప్రవేశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్న‌ట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉంటే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హజీ అలీ దర్గా ట్రస్ట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు.

English summary
The Bombay High Court Friday directed that women should be allowed entry into the inner sanctum of the Haji Ali Dargah at par with men. While pronouncing it’s judgment on Friday, the High Court also said that safety and security of women have to be taken care of by the state and the Dargah trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X