సగం భారతీయుల శరీరాల్లో కరోనా యాంటీబాడీలు- తాజా అంచనాల్లో వెల్లడి

దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతున్న వేళ రోగుల శరీరాల్లో యాంటీబాడీలు పెంచేందుకు డాక్టర్లు చేయని ప్రయత్నం లేదు. కరోనా సోకకపోయినా లక్షల మంది తమ శరీరాల్లో యాంటీబాడీలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ అంతర్జాతీయ అంచనాల ప్రకారం భారతీయుల్లో సగానికి పైగా మంది శరీరాల్లో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు వెల్లడైంది.

భారత్‌లో కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలోనే పలు రాష్టాల్లో సీరో సర్వే నిర్వహించారు. ఇందులో చాలా చోట్ల సగం జనానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందినట్లు తేలింది. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్ధ క్రెడిట్‌ సూసే తాజా అంచనాల ప్రకారం భారతీయుల్లో సగానికి పైగా మంది శరీరాల్లో కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ప్రజలు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించినట్లు నిర్దారణ అవుతున్న తరుణంలో తాజా అంచనాలు వైద్య వర్గాలతో పాటు సాధారణ ప్రజలకూ ఊరటనిస్తున్నాయి.

Half of India’s population could have antibodies against Covid, Credit Suisse estimates

క్రెడిట్ సూసే అంచనాల ప్రకారం 77 కోట్ల మంది భారతీయుల్లో యాంటీబాడీలు అభివృద్ది చెందినట్లు అంచనా వేశారు. కేసుల పరంగా చూస్తే కోటి కేసులకు 28 కోట్ల మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉన్నట్లు తాజా అంచనాల్లో తేలింది. గతేడాది డిసెంబర్‌లో ఐసీఎంఆర్‌ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 21.4 శాతం జనాభాకు లేదా 28 కోట్ల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే క్రెడిట్ సూసే మాత్రం తమవి అంచనాలు మాత్రమేనని వాస్తవ ఫలితాలు కావాలంటే జాతీయ స్దాయిలో సీరో సర్వే నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+