• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్‌ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్

|

భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్‌గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మర్కజ్ ఉదంతం దేశాన్ని ఎంతలా టెన్షన్‌కి గురిచేసిందో ఇప్పుడు 'యూకె రిటర్నీస్' కూడా దేశాన్ని అంతలా టెన్షన్‌కి గురిచేస్తున్నారు. యూకె నుంచి వచ్చిన 20 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం.. ఇందులో సగం మందికి కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌ సోకేందుకు అవకాశం ఉన్నట్లు నిపుణులు విశ్వసిస్తుండటమే ఇందుకు కారణం.

శరణ్య రవిచంద్రన్ హాట్ ఫోటో గ్యాలరీ..

సగం మందిలో కొత్త స్ట్రెయిన్‌...?

సగం మందిలో కొత్త స్ట్రెయిన్‌...?

కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన 20 మంది యూకె రిటర్నీస్‌ దేశంలో కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌ వ్యాప్తికి క్యారియర్స్‌గా మారవచ్చునని భారత్‌లోని జన్యుశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.'సోమవారం యూకె నుంచి వచ్చినవారిలో 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం యూకెలో 60శాతం కేసులు కొత్త స్ట్రెయిన్‌‌ కారణంగానే నమోదవుతున్నాయి.ఆ లెక్కన భారత్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన 20 మంది యూకె రిటర్నీస్‌లో కనీసం సగం మంది కొత్త స్ట్రెయిన్‌ బారినపడి ఉంటారు. ఇలా జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది.' అని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్,సైంటిస్ట్ డా.రాకేష్ మిశ్రా పేర్కొన్నారు.

కొత్త కేసుల్లో వైరస్ జన్యువులను విశ్లేషించాలి : సీసీఎంబీ సైంటిస్ట్

కొత్త కేసుల్లో వైరస్ జన్యువులను విశ్లేషించాలి : సీసీఎంబీ సైంటిస్ట్

'కొన్ని నెలల క్రితమే యూకె నుంచి భారత్‌కు వచ్చినవాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వారు అసింప్టమాటిక్‌గా మారిపోవచ్చు. ఒకవేళ వారికేమైనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు ఉంటే ఇప్పటికే ఇతరులకు కూడా అంటించి ఉండవచ్చు. తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన యూకె రిటర్నీస్‌ను మాత్రం ప్రత్యేకంగా క్వారెంటైన్‌లో ఉంచాలి. గత కొద్దివారాల్లో యూకె నుంచి వచ్చినవాళ్లందరినీ ట్రాక్ చేయాలి.ఒకవేళ వారికి పాజిటివ్‌గా తేలితే వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాలి. అంతేకాదు,దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల్లోనూ వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాలి. అలా అయితే కొత్త రకం వైరస్ ఇదివరకు వ్యాప్తిలో ఉందా లేదా అన్నది తెలుస్తుంది.' అని డా.మిశ్రా తెలిపారు.

వైరస్ రూపాంతరం సర్వ సాధారణం...

వైరస్ రూపాంతరం సర్వ సాధారణం...

'వైరస్‌లు రూపాంతరం చెందడం సర్వ సాధారణం. పైగా వైరస్‌లు వేగంగా రూపాంతరం చెందుతుంటాయి. ఎందుకంటే రూపాంతరం చెందే క్రమంలో వాటి పరిణామ క్రమంలోని లోపాలను అవి సరిదిద్దుకోవు. అందువల్ల వాటి ఆర్ఎన్ఏ ప్రతిరూపంలోని లోపాలు అలాగే ఉండిపోతాయి. ఇన్‌ఫ్లుయెంజాకు మన వద్ద వ్యాక్సిన్ లేకపోవడానికి కారణం... ప్రతీ సంవత్సరం అది రూపాంతరం చెందడమే. కాబట్టి వ్యాక్సిన్లు వాటిపై సమర్థవంతంగా పనిచేయలేవు.' అని మిశ్రా పేర్కొన్నారు.

అదే జరిగితే హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే....

అదే జరిగితే హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే....

'కొత్తగా వెలుగుచూసిన స్ట్రెయిన్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో... ఒకవేళ భారత్‌లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ నమోదైతే... దేశంలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతాయి. ఫలితంగా మన హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేశంలో ఎక్కడైనా కొత్త స్ట్రెయిన్‌ని గుర్తిస్తే వెంటనే దాని వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టాలి. కరోనాకు సంబంధించి ఇప్పటివరకూ 4వేల రకాల జన్యు సీక్వెన్సులను వేరు చేయడం జరిగింది. ఇందులో కొన్నింటిని డాక్యుమెంట్ కూడా చేయడం జరిగింది. భారత్‌లో ఇప్పటికైతే కొత్త స్ట్రెయిన్‌ని గుర్తించలేదు. తక్కువ టెస్టులు,తక్కువ సంఖ్యలో వైరస్ జన్యు సీక్వెన్సులను విశ్లేషిస్తుండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.' అని మిశ్రా చెప్పుకొచ్చారు.

ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

కరోనా వైరస్ నివారణ కోసం అభివృద్ది చేసిన వ్యాక్సిన్లు కొత్త స్ట్రెయిన్‌ని ఎదుర్కోవడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తాయని మిశ్రా అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు కొత్త స్ట్రెయిన్‌పై పనిచేయకపోవడానికి చాలా తక్కువ అవకాశం ఉందన్నారు. mRNA పద్దతిలో అభివృద్ది చేసిన మోడెర్నా,ఫైజర్ వ్యాక్సిన్లు రూపాంతరం చెందిన వైరస్‌ను కూడా టార్గెట్ చేయగలవన్నారు. భారత్‌లో మొత్తం ఐదు జీనోమ్ సెంటర్స్(వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించే కేంద్రాలు) ఉన్నాయని.. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహా మరో నాలుగు సెంటర్స్ కూడా జీనోమ్‌ను విశ్లేషించగలవని అన్నారు. మరికొద్దిరోజుల్లో కొత్త రకం కరోనా వైరస్‌పై మనకు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

అందాలతో ఆకట్టుకొంటున్న దివ్య దురైసామి.. ఒంపు సొంపులతో..

English summary
There is a good chance that half of those who have tested positive after coming from the UK may be potential carriers of the new more infectious Covid-19 strain in India, genomic experts believe. So far, 20 passengers from UK have tested positive for coronavirus in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X