యూనివర్శిటీకి రూ. 77 లక్షల కరెంట్ బిల్లు, మేము కట్టలేము మహాప్రభో, కాపాడండి !
బెంగళూరు/హంపీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీగా ఇస్తామనే నినాదంతో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరువాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే సిద్దరామయ్య ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచేశారని ప్రజలు మండిపడుతున్నారు. నిజంగానే బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాలో గత నెల కంటే కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు కర్ణాటకలో కరెంట్ బిల్లులు పెంచారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కర్ణాటకలో కన్నడ భాషకు సంబంధించిన వివిధ అంశాలపై బహుళ విభాగాల పరిశోధనలకు (పీహెచ్ డీలు) పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని హోస్ పేట్ లోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం అధికారులు యూనివర్శిటీకి వచ్చిన అధిక విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే. జార్జ్‌కు విజ్ఞప్తి చేశారు. హంపీ విశ్వవిద్యాలయం అధికారులు మేము రూ. 77 లక్షల పెండింగ్ కంరెట్ బిల్లులు చెల్లించలేమని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పరమశివ మూర్తి కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే. జార్జ్ కు లేఖ రాశారు.

హంపీ విశ్వవిద్యాలయం మంత్రి జార్జ్ కు రాసిన లేఖలో యూనివర్శిటీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపించి ఆ సమస్యలు పరిష్కరించాలని మంత్రి జార్జ్ కు మనవి చేశారు. 1991లో స్థాపించబడిన హంపి కన్నడ విశ్వవిద్యాలయం వివిధ నిర్వహణలకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కరెంటు బిల్లులు పెరగడంతో పాటు లెక్చరర్ల కొరత కూడా యూనివర్సిటీలో నెలకొంది. ఇది విద్యాపరమైన డిమాండ్లను సమర్థవంతంగా తీర్చగల సామర్థ్యాన్ని అడ్డుకుంటుందని యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పరమశివమూర్తి మంత్రి జార్జ్ కు వివరించారు.
ఆర్థిక పరిమితులతో హంపీ విశ్వవిద్యాలయం యొక్క ప్రస్తుత సిబ్బంది సభ్యులకు తగినంతగా జీతాలు కూడా చెల్లించే పరిస్థితిలో లేదని, విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలు లేవని, డిగ్రీలు కోరుకునే విద్యార్థులను చేర్చుకోవడం వల్ల అంతర్గత ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయని, ఈ ఆర్థిక భారం పెరిగిపోయినా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్ ఇవ్వలేదని ఉపకులపతి పరమశివమూర్తి మంత్రి జార్జ్ కు రాసిన లేఖలో వివరించారని కన్నడ మీడియా తెలిపింది.

పది నెలల బకాయిలతో కలిపి దాదాపు రూ. కోటి వరకు విద్యుత్ బిల్లు బకాయి ఉంటుందని, విశ్వవిద్యాలయం ఇతర ఖర్చులను తీర్చడానికి అందుబాటులో ఉన్న నిధులను కేటాయిస్తున్నప్పటికీ, బకాయిల చెల్లింపు కోసం అదనపు ఆర్థిక సహాయం అవసరం అవుతుందని, ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యాలని మంత్రి జార్జ్ కు మనవి చేశారు.
హంపీ యూనివర్శిటీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోందని, ప్రభుత్వమే ఈ విశ్వవిద్యాలయాన్ని ఆదుకోవాలని వైస్ ఛాన్సలర్ పరమశివమూర్తి కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. బకాయి ఉన్న విద్యుత్ బిల్లును ప్రభుత్వం చెల్లించాలని హంపీ యూనివర్సిటీ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
జూన్ నెలలో అధిక విద్యుత్ బిల్లులు విధించడంపై కర్ణాటక ఇంధన శాఖకు ప్రజల నుంచి భారీ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపకులపతికి మంత్రికి వినతి పత్రం రాయడం హాట్ టాపిక్ అయ్యింది. హంపీ కన్నడ విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి రాష్ట్రంలోని విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి అందరికి తెలిసేలా చేసిందని కన్నడ మీడియా అంటోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications