పెళ్లి చేసుకోవాలని వేధింపులు: యువతి ఆత్మహత్య

 Harassment forces girl to end life
కాన్పూర్: తననే వివాహం చేసుకోవాలని తరచూ వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తి బారి నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటు చేసుకుంది. తన గదిలో ఉరివేసుకున్న తమ కూతురును చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువతి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అక్బర్‌పూర్ కొత్వాలి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. తన కూతురును వివాహం చేసుకోవాలని రంజాన్ అనే వ్యక్తి తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే.. తన కూతురుపై యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని చెప్పాడు.

చాలా రోజుల నుంచి తన కూతురును వేధిస్తున్నాడని ఆయన చెప్పాడు. ఆమె ఈ విషయాన్ని ఎవరితో చెప్పకపోవడంతో.. నిందితుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అతని తల్లిదండ్రులతో గొడవకు దిగారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల నుంచి నిందితుడు రంజాన్‌పై కేసు పెట్టాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నా.. వారు రాజీ చేసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారే తప్ప కేసు నమోదు చేయలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు.

ఇదంతా అవమానంగా భావించిన తన కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కాగా,
నిందితుడు రంజాన్, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శర్వానంద్ యాదవ్ తెలిపారు. నిందితుడు, అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+