హర్ష అవిశ్వాసం: నేతలతో జగన్, అధిష్టానంతో బొత్సబిజీ

జగన్, చంద్రబాబు, బొత్స బిజీ
ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణలు బిజీగా ఉన్నారు. జగన్, చంద్రబాబులు జాతీయ పార్టీ నేతలను కలుస్తున్నారు. సమైక్యాంధ్ర, సమన్యాయం కోసం వారు లాబీయింగ్ చేస్తున్నారు.
బొత్స సత్యనారాయణ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న బొత్స ఇప్పుడు తన వర్గం తయారు చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి చుక్కలు చూపిస్తుండటంతో బొత్స ఢిల్లీలో సమైక్యాంధ్ర కోసం అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. అయితే అంతిమంగా ఆయన పెద్దల మాటకే కట్టుబడనున్నారు. బొత్సతో పాటు మంత్రులు రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, సి రామచంద్రయ్య, కన్నా లక్ష్మీ నారాయణలులు ఉన్నారు.
41వ అంశంగా తెలంగాణ, విప్ జారీ
లోకసభలో బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో లోకసభ వ్యవహారాల అజెండాలో 41వ అంశంగా విభజన బిల్లును పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. విభజనపై చర్చకు లోకసభలో నాలుగు గంటల సమయం కేటాయించనుండగా, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడే అవకాశముంది.












Click it and Unblock the Notifications