రాజీవ్ హత్య: రాహుల్‌ని క్షమాపణ కోరిన గర్ల్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 22 ఏళ్ల హరిత్రా శ్రీహరన్ క్షమాపణలు కోరింది. ఈమె రాహుల్ తండ్రి రాజీవ్ హత్య కేసులో దోషులైన మురుగన్, నళినిల కుమార్తె. తొమ్మిదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటోంది.
తన తల్లిదండ్రులను క్షమించాలని రాహుల్ గాంధీకి కు విజ్ఞప్తి చేసింది. జరిగిన దానిపై తన తల్లిదండ్రులు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని చెప్పింది. మీరు ప్రేమించే వ్యక్తిని కోల్పోయారని, అదే శిక్ష తాను కూడా అనుభవిస్తున్నానని, తన తల్లిదండ్రులు బతికే ఉన్నా, వారికి దూరంగా జీవిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఒకవేళ వారు నేరం చేసి ఉంటే అందుకు తగిన శిక్ష అనుభవించారని హరిత్రా పేర్కొంది. తన తల్లిదండ్రులను విడుదల చేయాలని నిర్ణయించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

రాహుల్ 1
ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 22 ఏళ్ల హరిత్రా శ్రీహరన్ క్షమాపణలు కోరింది. ఈమె రాహుల్ తండ్రి రాజీవ్ హత్య కేసులో దోషులైన మురుగన్, నళినిల కుమార్తె. తొమ్మిదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటోంది.

రాహుల్ 2
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.

రాహుల్ 3
ముగ్గురు ఖైదీలు సుతేంద్రరాజా అలియాస్ శంతన్, వి శ్రీహరన్ అలియాస్ మురుగన్, ఎజి పెరారివలన్ అలియాస్ అరివ్‌ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాహుల్ 4
రాజీవ్ హత్య కేసులోని ఆ ముగ్గురు దోషుల ఉరిశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వానికి అనుమతి లేదంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

రాహుల్ 5
మార్చి 6వ తేదీ వరకు ఖైదీలను విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు వెల్లూరు జైలు అధికారులను, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రోజు మరోసారి కేంద్రం పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుంది.

రాహుల్ 6
రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలనే జయలలిత ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం పిటిషన్ దాఖలు చేసింది. ఆ ముగ్గురు ఖైదీలపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు కోరింది. దీంతో సుప్రీం కోర్టు స్టే విధించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications